Updated : 03 Dec 2021 09:30 IST

Stock market: భయాల్లోనూ లాభాలతో ప్రారంభమైన సూచీలు!

ముంబయి: ఒమిక్రాన్‌ ఆందోళనలోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభం కావడం విశేషం. అమెరికా మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు మార్కెట్లలో అప్రమత్తతను సృష్టిస్తున్నాయి. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయినప్పటికీ.. ప్రభుత్వ సన్నద్ధత కొంత ఆశాజనకంగా కనిపిస్తోంది. గత రెండు దశల అనుభవంతో కరోనా కట్టడికి యంత్రాంగం కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. ఈ భరోసాతోనే సూచీలు కొంత సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే, ఈ లాభాలు ఎంత వరకు నిలబడతాయన్నది చూడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 220 పాయింట్ల లాభంతో 58,682 వద్ద.. నిఫ్టీ 67 పాయింట్ల లాభంతో 17,469 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.99 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, ఎల్అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రాణిస్తున్నాయి. నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని