Updated : 26 Nov 2021 09:29 IST

Stock market: సూచీల్లో కొత్త వేరియంట్‌ భయాలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో కొత్త వేరియంట్‌ భయాలు అలముకున్నాయి. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ (B.1.1.529)పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనితో పాటు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్స్‌ గివింగ్‌ సంబరాల నేపథ్యంలో గురువారం అమెరికా మార్కెట్లు పనిచేయలేదు. నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఈ పరిణామాలు సూచీలను దెబ్బతీస్తున్నాయి.

ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 808 పాయింట్ల నష్టంతో 57,986 వద్ద.. నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో 17,297 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా మినహా అన్ని షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. అత్యధికంగా నష్టపోతున్న వాటిలో మారుతీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటన్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని