Stock market: సూచీల్లో కొనసాగుతున్న ఒమిక్రాన్‌ భయాలు!

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల తరహాలోనే దేశీయ సూచీలను ఒమిక్రాన్‌ భయాలు కలవరపెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్‌ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తుండటం వల్ల ఆర్థిక రికవరీకి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశీయంగానూ నిన్న ఒక్కరోజే 17 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం 6-8 తేదీల్లో జరగనుంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల కీలక రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు ప్రతికూలంగా కదలాడుతున్నాయి.

ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 108 పాయింట్ల నష్టంతో 57,587 వద్ద.. నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17,165 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.20 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, టైటన్‌ షేర్లు రాణిస్తున్నాయి. మారుతీ, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని