Stock market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు సూచీలకు  దన్నుగా నిలుస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి....

Updated : 07 Dec 2021 09:27 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు సూచీలకు  దన్నుగా నిలుస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా సూచీలు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఒమిక్రాన్‌ భయాల నుంచి సూచీలు నెమ్మదిగా బయటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పైగా నిన్న భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. రేపు వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలు సానుకూలంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల కీలక రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 418 పాయింట్ల లాభంతో 57,165 వద్ద.. నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 17,038 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.34 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతుండడం విశేషం. టాటా స్టీల్‌, యాక్సిస్ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు రాణిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని