Updated : 13 Dec 2021 09:32 IST

Stock market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రతపై ఆందోళనలు తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో.. సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో నడుస్తున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పైగా గత కొన్ని రోజుల దిద్దుబాటు నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 338 పాయింట్ల లాభంతో 59,125 వద్ద.. నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 17,617 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.59 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే ఇండియా, బజాజ్‌ ఫినాన్స్‌, టెక్‌ మహీంద్రా మినహా అన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని