Stock market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి....

Updated : 14 Dec 2021 10:08 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలు మరోసారి మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు అమెరికాలో ఫెడ్‌ సమావేశం ముందు సూచీల్లో అప్రమత్తత కనిపిస్తోంది. ఉద్దీపన ఉపసంహరణలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయనే దానిపై మదుపర్లు దృష్టి సారించారు. ఎఫ్‌ఐఐల విక్రయాలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశపరిచాయి. నేడు ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నష్టాలు చవిచూస్తున్నాయి.

ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్‌ 361 పాయింట్ల నష్టంతో 57,921 వద్ద.. నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 17,268 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.86 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు