Stock market: ఒమిక్రాన్‌ భయాలను వీడిన మార్కెట్లు.. 700 పాయింట్లు కోలుకున్న సెన్సెక్స్‌

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లు కోలుకోవడం విశేషం...

Published : 29 Nov 2021 12:22 IST

ముంబయి:  కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అరగంటలోనే కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఏకంగా 700 పాయింట్లు పుంజుకోవడం విశేషం. మరోవైపు 16,782 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయిన నిఫ్టీ.. కీలక 17150 మార్క్‌ను మళ్లీ అందుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ సూచీలను పైకి లాగాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాలను కట్టడి చేస్తున్నాయి. 

దేశీయంగా ఉన్న కొన్ని సానుకూలతలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. రిలయన్స్‌ టారిఫ్‌లు పెంచడం, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాపై సానుకూల ఆర్‌బీఐ సానుకూల ప్రతిపాదనలు, ముడి చమురు ధర తగ్గడం, వివిధ దేశాల కరెన్సీలు కోలుకోవడం వంటి పరిణామాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. 

మధ్యాహ్నం 12:09 గంటల సమయంలో సెన్సెక్స్‌ 428 పాయింట్ల లాభంతో 57,535 వద్ద.. నిఫ్టీ 113 పాయింట్ల లాభపడి 17,139 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో 21 షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టాటా స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా లాభాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని