Tega Industries IPO: ప్రారంభమైన టెగా ఐపీఓ.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటారా?

దిల్లీ: ఖనిజ శుద్ధి ప్రక్రియ, గనుల తవ్వకం, బల్క్‌ సాలిడ్స్‌ హ్యాండ్లింగ్‌ పరిశ్రమకు అవసరమైన కీలక ఉత్పత్తుల తయారీ, పంపిణీని నిర్వహిస్తోన్న టెగా ఇండస్ట్రీస్‌ ఐపీఓ నేడు ప్రారంభమైంది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ డిసెంబరు 3న ముగియనుంది. ఈ ఇష్యూలో మొత్తం 1,36,69,478 ఈక్విటీ షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నవే. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూపునకు 85.17 శాతం వాటా ఉంది. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ వాగ్నర్‌కు మరో 14.54 శాతం వాటాలున్నాయి. ఈ ఇష్యూలో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల(క్యూఐబీ)కు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు కేటాయించారు. మొత్తం రూ.619 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలు...

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: డిసెంబరు 01, 2021

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: డిసెంబరు 03, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: డిసెంబరు 08, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: డిసెంబరు 09, 2021

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: డిసెంబరు 10, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: డిసెంబరు 13, 2021

ముఖ విలువ: రూ.10 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

లాట్‌ సైజు: 33 షేర్లు

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 33 (ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 429 (13 లాట్లు)

ఐపీఓ ధర శ్రేణి: ₹443 - ₹453 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

నిధుల సమీకరణ అంచనా: రూ.619 కోట్లు

సంస్థ వివరాలు..

టెగా ఇండస్ట్రీస్‌ను 1976లో స్థాపించారు. ఆదాయపరంగా పాలిమర్‌ ఆధారిత మిల్‌ లైనర్లను తయారు చేయడంలో ఈ సంస్థది ప్రపంచంలోనే రెండో స్థానం. ఖనిజ శుద్ధి పరిశ్రమలో మైనింగ్‌, ప్రాసెసింగ్‌, స్క్రీనింగ్‌, గ్రైండింగ్‌, హ్యాండ్లింగ్‌ వంటి వివిధ దశల్లో రాపిడి, అరుగుదల నిరోధకతకు ఉపయోగించే రబ్బర్‌, పాలీయురేతీన్‌, ఉక్కు, సెరామిక్‌ ఆధారిత లైనింగ్‌లను ఇది అందిస్తోంది. మొత్తం 55 ఉత్పత్తులను తయారు చేస్తోంది. భారత్‌(3)తో పాటు చిలీ(1), దక్షిణాఫ్రికా(1), ఆస్ట్రేలియా(1)లో తయారీ కేంద్రాలున్నాయి. సంస్థకు వస్తున్న ఆదాయంలో దాదాపు 87 శాతం భారత్‌ వెలుపలి నుంచే వస్తుండడం గమనార్హం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఆర్థిక వివరాలు(రూ.కోట్లలో)..

సంవత్సరం      2019       2020      2021

ఆదాయం        643        696        857

ఆస్తులు          790       887       1,018

లాభాలు         32.67    65.50       136

► Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని