Elon Musk: ఎలాన్ మస్క్ నోట ‘శ్రీమంతుడు’ డైలాగ్..!
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ యువతరానికి ఓ సందేశమిచ్చారు....
శాన్ఫ్రాన్సిస్కో: టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ న్యూఇయర్ వేళ యువతరానికి ఓ సందేశమిచ్చారు. అది మహేశ్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలోని డైలాగ్‌లను గుర్తుచేసేలా ఉండడం విశేషం. కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యార్థులకు కొన్ని సలహాలిచ్చారు. సాటి మానవులకు పనికొచ్చే పనులు మాత్రమే చేయాలని హితవు పలికారు. మనం సమాజం నుంచి ఎంత లబ్ధి పొందుతున్నామో.. అంతకంటే ఎక్కువ తిరిగివ్వాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని విద్యార్థులకు మస్క్ సూచించారు. అది నిరంతర అభ్యసనం వల్లే సాధ్యమవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడినప్పుడే మనం మరింత స్వేచ్ఛగా ఆలోచించగలుగుతామని చెప్పారు. అందుకే వివిధ రంగాలు, వృత్తుల్లో ఉన్నవారితో సంభాషిస్తూ ఉండాలన్నారు.
గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ మస్క్ ఇదే తరహాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో వారి విద్యార్హతల కంటే.. వారిలో ఉన్న ప్రత్యేక సామర్థ్యాలకే విలువిస్తానని తెలిపారు. కాలేజీ డిగ్రీలూ ప్రతిభకు కొలమానామైనప్పటికీ.. అది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. బిల్ గేట్స్, లారీ ఎలిసన్, స్టీవ్ జాబ్స్ వంటి వారు కనీసం కాలేజీ విద్య కూడా పూర్తి చేయలేదని ఉటంకించారు. అదే వారిని ఉద్యోగంలో నియమించుకోగలిగితే.. అంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదని మస్క్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు