WPI inflation: ఐదు నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబరులో 12.54 శాతంగా నమోదైంది. ఇది ఐదు నెలల గరిష్ఠం కావడం గమనార్హం....

Published : 15 Nov 2021 18:11 IST

దిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబరులో 12.54 శాతంగా నమోదైంది. ఇది ఐదు నెలల గరిష్ఠం కావడం గమనార్హం. తయారీ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలే ద్రవ్యోల్బణం ఎగబాకడానికి ప్రధాన కారణం. ఏప్రిల్‌ నుంచి వరుసగా ఏడో నెలా ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదైంది. సెప్టెంబరులో 10.66 శాతానికి తగ్గినప్పటికీ.. మళ్లీ గత నెల పెరగడం గమనార్హం.

క్రితం ఏడాది అక్టోబరుతో పోలిస్తే మినరల్‌ ఆయిల్స్‌, బేసిక్‌ మెటల్స్‌, ఆహార ఉత్పత్తులు, ముడి పెట్రోలియం, సహజవాయువు, రసాయనాలు, రసాయన ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి. సెప్టెంబరులో 11.41 శాతంగా ఉన్న తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం అక్టోబరులో 12.04 శాతానికి ఎగబాకింది. ఇంధన, విద్యుత్తు రంగంలో ద్రవ్యోల్బణం 24.84 శాతం నుంచి 37.18 శాతానికి, ముడి పెట్రోలియం 71.86 నుంచి 80.57 శాతానికి పెరిగింది. -4.69 శాతంగా ఉన్న ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబరులో -1.69కి పెరిగింది. కూరగాయల ధరలు -18.49 శాతం, ఉల్లి ధరలు రూ.25.01 శాతం తగ్గడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని