Loans: ఆలైన్‌లోనే అప్పు తీసుకుంటున్నారు!

రుణం కోసం బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యువత ఇష్టపడటం లేదు. సులువుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి, అప్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్‌-19 రెండో దశ తర్వాత ఇది ఒక్కసారిగా పెరిగిందని హోమ్‌ క్రెడిట్‌

Updated : 21 Nov 2021 09:50 IST

దిల్లీ: రుణం కోసం బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యువత ఇష్టపడటం లేదు. సులువుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి, అప్పు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కొవిడ్‌-19 రెండో దశ తర్వాత ఇది ఒక్కసారిగా పెరిగిందని హోమ్‌ క్రెడిట్‌ ఇండియా సంస్థ ‘హౌ ఇండియా బారోస్‌’ అనే సర్వేలో తేలింది. ఈ సంస్థ దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు సహా 9 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 21-45 ఏళ్ల మధ్య వయస్కుల్లో 40 శాతం మందికి పైగా ఆన్‌లైన్‌లోనే రుణాలను తీసుకునేందుకు మొగ్గు చూపారు. కొవిడ్‌ నేపథ్యంలో గత ఏడాది దాదాపు 85శాతం మంది ఇంటి ఖర్చులకు రుణాలు తీసుకోగా, ఈ ఏడాది ఇది 4 శాతానికి పడిపోయిందని సర్వే వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో అవసరం కోసం చేసే రుణాలు తగ్గి, కోరికల ఆధారిత అప్పులు పెరిగాయని పేర్కొంది. కొత్త వ్యాపారాలు, ఉన్న వాటిని విస్తరించడం కోసం తీసుకున్న రుణాలు 28 శాతం ఉండగా, కొత్త ఇల్లు/మరమ్మతు రుణాలు 13 శాతం, ఆరోగ్య అత్యవసరాలు 2 శాతం, వాహన రుణాలు 9 శాతం, వివాహం కోసం 3 శాతం, విద్యా రుణం 2 శాతం వరకు ఉన్నాయని సర్వే పేర్కొంది. మహమ్మారి ప్రభావం నుంచి హైదరాబాద్‌, బెంగళూరులు వేగంగా కోలుకున్నాయి. హైదరాబాద్‌లో 41 శాతం మంది వ్యాపార విస్తరణ కోసం రుణాలను తీసుకున్నారు. బెంగళూరులో 42 శాతం మంది మన్నికైన వినియోగ వస్తువుల కొనుగోలు కోసం అప్పు చేసినట్లు సర్వే వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు