Source Of Income: రెండో ఆదాయ మార్గాన్ని సిద్ధం చేసుకుందాం ఇలా..

ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఉద్యోగమో, వ్యాపారమో పోవడం వంటి గడ్డు పరిస్థితులు

Updated : 01 Jan 2022 11:54 IST

జీవితమంటేనే అనిశ్చితి! ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఉద్యోగమో, వ్యాపారమో పోవడం వంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా మనల్ని నిలబెట్టేది రెండో ఆదాయం! కొవిడ్‌ దెబ్బకు దాని ఆవసరం చాలామందికి తెలిసి వచ్చింది. కాబట్టి కొత్త ఏడాదిలో మరింత అప్రమత్తమవుదాం. ఎలాంటి అనూహ్య పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కోవడం కోసం.. రెండో ఆదాయ మార్గాన్ని సిద్ధం చేసుకుందాం! 

ఉద్యోగం చేస్తే.. నెలకు ఒక్కసారే జీతం వస్తుంది. మిగతా రోజులన్నీ ఖర్చులే. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది వ్యాపారుల ఆర్జన కూడా అంతంతమాత్రమే. కాబట్టి పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలనూ సృష్టించుకోవాల్సిందే. ఖర్చులు, రుణ వాయిదాలకు ప్రధాన ఆదాయం పోయినా.. ప్రత్యామ్నాయంగా వచ్చే ఆదాయాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. ఈ ఇంటర్నెట్‌ యుగంలో అవకాశాలకు కొదవ లేదు. ఒకప్పుడు రెండో ఉద్యోగం లేదా వ్యాపారం సాధ్యమయ్యేవి కావు. ఇప్పుడు మాత్రం.. ఉద్యోగానికి పూర్తి న్యాయం చేస్తూనే.. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇష్టాలను (హాబీలు) రూపాయిగా మార్చుకునేందుకు అవకాశాలు కోకొల్లలు. మీ నైపుణ్యాలను ఇతరులకు ఆన్‌లైన్‌లోనే నేర్పించవచ్చు. వంట మొదలు.. కోడింగ్‌ వరకూ కాదేదీ ఆన్‌లైన్‌ ఆర్జనకు అనర్హం. కొందరికి పుస్తకాలు చదవడం ఇష్టం. కానీ అందుకు సమయం ఉండదు. ఒక పుస్తకంలోని విశేషాలను సంక్షిప్తంగా చెప్పి, వారికి వినిపించడం లేదా ఒక సమీక్షలా రాసి ఇవ్వడమూ ఆదాయమార్గమే. ఊర్లో పూట గడవక నగర బాట పట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూనే.. స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తూ నెలనెలా చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బు ఆర్జిస్తున్నాడు. ఆసక్తి ఉండాలే గానీ.. వస్తువులను విశ్లేషిస్తూ చేసే వీడియో కామర్స్‌కు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ఆలోచన-ఆసక్తి-ఆచరణ ఈ మూడూ ఉంటే చాలు.. రెండో ఆదాయం ఆర్జించడం పెద్ద కష్టమేమీ కాదు. 

ఇవిగో కొన్ని మార్గాలు 
*ఇంట్లో/ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పడం 
*ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో వస్తువులను అమ్మడం 
* యాప్‌లను రూపొందించడం 
* యూట్యూబ్‌ ఛానళ్లను నిర్వహించడం, ఆసక్తికర వీడియోలు అప్‌లోడ్‌ చేయడం 
* ఫ్రీలాన్సింగ్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని