Retirement: పదవీ విరమణ తర్వాత ఎలా?

‘పదవీ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా గడిపేందుకు సన్నద్ధంగా ఉన్నవారు చాలా తక్కువే. సంపాదన ఆగిపోయిన తర్వాత పదేళ్ల తర్వాత ఉన్న డబ్బంతా ఖర్చయిపోతుందని, ఆ తర్వాత ఎలా అనే దిగులు చాలామందిలో ఉంది.

Updated : 12 Dec 2021 09:06 IST

10లో 9 మంది ఆలోచన ఇదే
మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: ‘పదవీ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా గడిపేందుకు సన్నద్ధంగా ఉన్నవారు చాలా తక్కువే. సంపాదన ఆగిపోయిన తర్వాత పదేళ్ల తర్వాత ఉన్న డబ్బంతా ఖర్చయిపోతుందని, ఆ తర్వాత ఎలా అనే దిగులు చాలామందిలో ఉంది. నలుగురిలో ఒకరు మాత్రం పదవీ విరమణ గురించి ఆలోచించడమే లేదు’ ఇవన్నీ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన పదవీ విరమణ సూచీ నివేదికలో తేలిన విషయాలు. కార్వీ ఇన్‌సైట్స్‌తో కలిసి నిర్వహించిన ఈ ‘ఇండియా రిటైర్మెంట్‌ ఇండెక్స్‌ స్టడీ’లో పలు ఆసక్తికర విషయాలు తేలాయని వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం నగర భారతం ఈ సూచీలో 44 దగ్గర నిలిచింది. ఆరోగ్యం, ఆర్థికం, భావోద్వోగాలను పరిగణనలోకి తీసుకుని, దీనిని రూపొందించింది. 28 నగరాల్లోని 1,800 మందికి పైగా ఈ డిజిటల్‌ సర్వేలో పాల్గొన్నారు.

* ప్రతి ముగ్గురు దేశీయుల్లో ఒకరు పదవీ విరమణ చేసేందుకు ఇష్టపడటం లేదు. 56-60 ఏళ్ల మధ్య 19శాతం, 61-65 ఏళ్ల మధ్య 12 శాతం మంది రిటైర్‌ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు.

* 47 శాతం మంది ఆర్థిక స్వేచ్ఛ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు.

* 70శాతం మందికి పదవీ విరమణ తర్వాత అవసరాల గురించి అవగాహన ఉంది. సాధ్యమైనంత తొందరగా పదవీ విరమణ ప్రణాళిక ప్రారంభించాలని 80 శాతం మంది భావిస్తున్నారు. 41 శాతం మంది ఇతర బాధ్యలతో పాటు పదవీ విరమణ కోసమూ పెట్టుబడులు ప్రారంభించాలని భావిస్తున్నారు. నలుగురిలో ఒకరు మాత్రం 65 ఏళ్ల వయసు వచ్చాకే విశ్రాంత జీవనం కోసం ఆలోచిస్తున్నారు.

* 45 శాతం మంది రిటైరయ్యాక తమ పిల్లల మీద ఆధారపడతామని వెల్లడించారు. 36 శాతం మంది తమ దగ్గర కావాల్సినంత సంపద ఉందని పేర్కొన్నారు.

* పదవీ విరమణ కోసం పొదుపు అనేది ముఖ్యమైన ఆర్థిక అంశంగా 24 శాతం మంది చెబుతుండగా.. 56 శాతం మంది తమ దగ్గరున్న పొదుపు మొత్తం, రిటైరయ్యాక 10 ఏళ్లలో ఖర్చయిపోతుందని భావిస్తున్నారు.

* 67 శాతం మంది పట్టణవాసులు పదవీ విరమణ కోసం జీవిత బీమా మంచి పథకం అనుకుంటుండగా.. 40 శాతం మంది మాత్రమే వీటిని ఎంపిక చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని