Agni SmartPhone: తొలి దేశీయ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ‘అగ్ని’.. ధర ఎంతంటే?

భారత్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసిన తొలి దేశీయ కంపెనీగా లావా ఇంటర్నేషనల్‌ నిలిచింది. ‘అగ్ని’ పేరిట వస్తున్న ఈ మొబైల్‌ను నోయిడాలోని తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు...

Updated : 09 Nov 2021 16:22 IST

దిల్లీ: భారత్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల చేసిన తొలి దేశీయ కంపెనీగా లావా ఇంటర్నేషనల్‌ నిలిచింది. ‘అగ్ని’ పేరిట వస్తున్న ఈ మొబైల్‌ను నోయిడాలోని తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలో ‘మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌’పై 5జీ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చిన రెండో కంపెనీ లావాయేనని సంస్థ అధ్యక్షుడు, బిజినెస్‌ హెడ్‌ సునీల్‌ రైనా తెలిపారు. ప్రస్తుతం దీని ధర రూ.19,999గా నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, ప్రారంభ ఆఫర్‌ కింద ముందస్తు బుకింగ్‌ చేసుకునే వారికి రూ.17,999కే అందించనున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది.

నవంబరు 18 నుంచి రిటైల్‌ ఔట్‌లెట్లతో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో లావా అగ్ని ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. ఆలోపు లావా ఈ-స్టోర్‌లో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌లోనైతే రూ.500 చెల్లించి ప్రీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 9-17 మధ్య ప్రీ బుకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

మొబైల్‌ స్పెసిఫికేషన్లు..

* 6.78 అంగుళాల ఫుల్‌ హై డెఫినిషన్‌ ప్లస్‌ ఐపీఎస్‌ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే

* 8 జీబీ ర్యామ్‌

* 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ

* 64 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా

* 16 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా

* లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ 11ఓఎస్‌

* 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 30వాట్‌ సూపర్‌ఫాస్ట్‌ ఛార్జర్‌

* సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ అన్‌లాక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని