Tesla: ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నా: ఎలాన్ మస్క్
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘
ఇంటర్నెట్‌డెస్క్: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘నేను ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను. పూర్తిస్థాయిలో ఇన్‌ఫ్లూయన్సర్‌గా మారాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. నిజంగానే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారా..? అన్న విషయంపై అతని ఫాలోవర్లలో గందరగోళం నెలకొంది. మస్క్ తరచూ సోషల్ మీడియాను ప్రచారం కోసం, వదంతుల వ్యాప్తికి వాడుకొంటారు. జనవరిలో జరిగిన కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో మాత్రం మరికొన్ని సంవత్సరాలు టెస్లా సీఈవోగా కొనసాగుతానని ఆశిస్తున్నట్లు మస్క్ పేర్కొనడం గమనార్హం.
గత నెల పన్ను చెల్లింపు కోసం పదిశాతం షేర్లు విక్రయించాలా.. వద్దా అన్న అంశంపై మస్క్ ట్విటర్ పోల్ నిర్వహించారు. దీనిలో ఆయన ఫాలోవర్లు షేర్ల విక్రయానికే ఓటు వేశారు. దీనికి తోడు ఈ పోల్ పెట్టడానికి ముందే మస్క్ సోదరుడు కింబల్ టెస్లాలోని వాటాలను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. ట్విటర్లో వాగ్దానం చేసిన విధంగానే దాదాపు 9,00,000 టెస్లా షేర్లను కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ విక్రయించారు. అమెరికా సెక్ వద్ద లభించిన వివరాల ప్రకారం.. వీటి విలువ 1.1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8250 కోట్లు)గా ఉంది. దీంతో టెస్లా షేర్ల ధర పతనమై 50 బిలియన్ డాలర్లు నష్టం వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్