జనవరిలో భారత్‌కు టెస్లా మోడల్‌-3

టెక్‌ దిగ్గజం టెస్లా తన మోడల్‌-3 భారత్‌లోకి తీసుకొచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా ..

Updated : 01 Jan 2021 16:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం టెస్లా తన మోడల్‌-3 భారత్‌లోకి తీసుకొచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కూడా సోమవారం ధ్రువీకరించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక పేర్కొంది. తొలుత విక్రయాలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత అసెంబ్లింగ్‌‌, తయారీపై దృష్టిపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ నెంబర్‌ వన్‌ తయారీ హబ్‌గా మారుతుందన్నారు.

మరోపక్క జనవరిలో మోడల్‌ -3 కార్ల బుకింగ్స్‌ స్వీకరణను ప్రారంభించి జూన్‌లో డెలివరీలు మొదలు పెట్టేలా యత్నాలు చేస్తున్నట్లు కొన్ని నివేదికలను ఉటంకిస్తూ ఆంగ్ల ప్రతిక ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది.  అక్టోబర్‌లో టెస్లా  సీఈవో అలెన్‌ మస్క్‌ కూడా  ఈ విషయాన్ని ముందస్తుగా వెల్లడించారు. 2021 నాటికి భారత్‌లో టెస్లా ఉంటుందని ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో భారత్‌లో పరిశోధనశాలను, బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని టెస్లా భావిస్తోంది. ఇక టెస్లా మోడల్‌ 3 కారు పూర్తి విదేశాల్లోనే తయారై భారత్‌కు చేరనుంది. కంపెనీ ఈ కార్లకు ఎటువంటి డీలర్‌ షిప్‌లను ఏర్పాటు చేయకుండా.. నేరుగా విక్రయించే అవకాశం ఉంది. దాదాపు 2016 నుంచి భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలని టెస్లా భావిస్తోంది.

ఇవీ చదవండి..

ఆ ఒక్క మాట ఆమె పాలిట శాపమైంది!

‘యూఎస్‌లో ఒకేసారి నాలుగు సంక్షోభాలు’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని