Tesla Bot: టెస్లా నుంచి హ్యుమనాయిడ్‌ రోబో.. లక్ష్యం ఇదే!

విద్యుత్తు కార్లు, అటానమస్‌ కార్ల తయారీలో తనదైన ముద్ర వేస్తున్న టెస్లా.. ఇక రోబోటిక్‌ రంగంలోకి ప్రవేశించబోతోంది. తమ సంస్థ నుంచి రాబోయే భవిష్యత్తు ‘హ్యుమనాయిడ్‌ రోబో’కు సంబంధించిన నమూనాను వచ్చే ఏడాది ప్రవేశపెడతామని...

Updated : 20 Aug 2021 22:17 IST

వాషింగ్టన్‌: విద్యుత్తు కార్లు, అటానమస్‌ కార్ల తయారీలో తనదైన ముద్ర వేస్తున్న టెస్లా.. ఇక రోబోటిక్‌ రంగంలోకి ప్రవేశించబోతోంది. తమ సంస్థ నుంచి రాబోయే భవిష్యత్తు ‘హ్యుమనాయిడ్‌ రోబో’కు సంబంధించిన నమూనాను వచ్చే ఏడాది ప్రవేశపెడతామని సంస్థ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. గురువారం జరిగిన ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డే’ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ‘టెస్లా బోట్‌’గా పేర్కొంటున్న ఈ రోబోకు సంబంధించిన ప్రాథమిక వివరాలను వెల్లడించారు. మనుషులు చేయడానికి బోర్‌గా ఫీలయ్యే పనులను చేసేలా తమ ‘టెస్లా బోట్‌’ను రూపొందిస్తున్నామని ప్రకటించారు. కారుకు బోల్ట్‌లు బిగించడం, నిత్యావసర దుకాణాల్లో సరకులను తీసుకోవడం వంటి పనులు చేసేలా దీన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రోబో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని మస్క్‌ తెలిపారు. శ్రామికుల కొరతను ఇది తీరుస్తుందన్నారు. అయితే, దీన్ని అందుబాటు ధరలో తయారు చేయడం అన్నింటికంటే ముఖ్యమైన అంశమన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని