Dish TV AGM: సుభాష్‌ చంద్ర కుటుంబానికి పరీక్షా సమయం..!

డిష్‌ టీవీ 33వ వార్షిక సమావేశం(ఏజీఎం) రేపు జరగనుంది. ఇప్పటికే సుభాష్‌ చంద్ర నేతృత్వంలోని ప్రమోటర్లు.. యస్‌బ్యాంక్‌ మధ్య వివాదం కారణంగా  రెండు సార్లు

Published : 29 Dec 2021 20:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డిష్‌ టీవీ 33వ వార్షిక సమావేశం(ఏజీఎం) రేపు జరగనుంది. ఇప్పటికే సుభాష్‌ చంద్ర నేతృత్వంలోని ప్రమోటర్లు.. యస్‌బ్యాంక్‌ మధ్య వివాదం కారణంగా  రెండు సార్లు ఈ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో డిష్‌టీవీ యాజమాన్యం అశోక్‌ కురియన్‌ను మరోసారి బోర్డులో నియమించాలని కోరింది. కంపెనీ బోర్డును పునర్‌ వ్యవస్థీకరించాలని యస్‌బ్యాంక్‌ లిమిటెడ్‌ నుంచి నోటీసులు అందుకొంది. ఈ క్రమంలో ఎండీ జవహర్‌ గోయల్‌ మరో కొందరు డైరెక్టర్లను తొలగించాలని డిమాండ్‌ చేసింది.

ఈ వివాదం ముంబయి ఎన్‌సీఎల్‌టీ వద్దకు వెళ్లింది. యస్‌బ్యాంక్‌ ఓటింగ్‌ హక్కులపై స్టే విధించాలన్న డిష్‌టీవీ విన్నపంపై ఎన్‌సీఎల్‌టీ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ప్రస్తుతం యస్‌బ్యాంక్‌కు డిష్‌టీవీలో 24.19శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే వాటాదారుల సమావేశం కీలక పాత్ర పోషించనుంది. ఈ సమావేశంలో కంపెనీ ఆర్థిక పరిస్థితులు వెల్లడించడంతోపాటు.. నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌ కురియన్‌ పునర్నియామకం, ఆడిటర్లకు చెల్లింపులు వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని