మార్కెట్లకు, ఆర్థిక వ్యవస్థకు లంకె తెగింది

‘స్టాక్‌ మార్కెట్లు, వాస్తవ ఆర్థిక వ్యవస్థకు మధ్య లంకె తెగిందని.. ఇది వ్యవస్థపై ప్రభావం చూపుతోందంటూ ఆర్‌బీఐ, ఆర్థిక స్థిరత్వ బోర్డు’ లెవనెత్తిన

Published : 26 Feb 2021 04:32 IST

భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అంతే
సెబీ ఛైర్మన్‌ త్యాగి

ముంబయి: ‘స్టాక్‌ మార్కెట్లు, వాస్తవ ఆర్థిక వ్యవస్థకు మధ్య లంకె తెగిందని.. ఇది వ్యవస్థపై ప్రభావం చూపుతోందంటూ ఆర్‌బీఐ, ఆర్థిక స్థిరత్వ బోర్డు’ లెవనెత్తిన ఆందోళనలను సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగి అంగీకరించారు. అది నిజమేనని.. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని.. పేర్కొన్నారు. ‘మార్చి 2020లో మార్కెట్లు భారీగా పతనమయ్యాక.. ఏప్రిల్‌ నుంచి అత్యంత వేగంగా పెరిగి 30 ఏళ్లలోనే ఎన్నడూ లేనంతగా రికవరీ అయ్యాయి. సాధారణంగా స్టాక్‌ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థకు కొలమానంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఏ దిశలో పరుగులు తీస్తే ఆ దిశలో ఇవీ దౌడు తీస్తాయి. అయితే కరోనా తర్వాత ఈ లంకె తెగిందంటూ ఎఫ్‌ఎస్‌బీ, ఆర్‌బీఐలతో పాటు పలు సంస్థలు ఆందోళన లేవనెత్తాయి. దీని వల్ల వ్యవస్థ స్థిరత్వానికి ప్రమాదం ఏర్పడవచ్చని ఆందోళన వెలిబుచ్చాయి. అయితే మార్కెట్లలో ఈ తరహా అనూహ్య హెచ్చుతగ్గులు చాలా అంతర్జాతీయ మార్కెట్లలో కనిపించాయి. కరోనా తర్వాత తీసుకున్న చర్యల వల్ల ఆ ప్రభావం కనిపించింద’ని గురువారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో త్యాగి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని