అత్యంత భద్రంగా ఉబర్‌

క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ తన వినియోగదారుల భద్రత విషయంలో మరింత మెరుగైన స్థానం సంపాదించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న రిస్క్‌ ఇంజినీరింగ్‌ బృందం రెండేళ్ల క్రితం 99.9 కచ్చితత్వం సాధించగా ఈసారి 99.999 శాతం కచ్చితత్వాన్ని సాధించింది.

Published : 21 Jul 2021 01:11 IST

 హైదరాబాద్‌ బృందం ఘనత

ఈనాడు, హైదరాబాద్‌: క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ తన వినియోగదారుల భద్రత విషయంలో మరింత మెరుగైన స్థానం సంపాదించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న రిస్క్‌ ఇంజినీరింగ్‌ బృందం రెండేళ్ల క్రితం 99.9 కచ్చితత్వం సాధించగా ఈసారి 99.999 శాతం కచ్చితత్వాన్ని సాధించింది. ఈ రిస్క్‌ ఇంజినీరింగ్‌ బృందంలో 15 మంది ఉన్నారు. ఉబర్‌ ఫ్లాట్‌ఫాం కింద రైడర్స్‌, ఈటర్స్‌, ఎర్నర్స్‌ తదితరులు ఉబర్‌ సేవలను అత్యంత భద్రంగా ఉపయోగించుకునేందుకు ఈ బృందం సహాయం చేస్తుంది. మెషిన్‌ లెర్నింగ్‌, విజువలైజేషన్‌, ఆప్టిమైజేషన్‌ సాంకేతికతల ద్వారా వినియోగదారుల భద్రత మరింత పెంచడమే తమ తొలి ప్రాధాన్యమని ఉబర్‌ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ నాగ కాసు తెలిపారు.


ఐపీఓకి ఆనంద్‌ రాఠీ వెల్త్‌ దరఖాస్తు

దిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి నిమిత్తం సంబంధిత దరఖాస్తు పత్రాలను సెబీకి ఆనంద్‌ రాఠీ వెల్త్‌ సమర్పించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లకు చెందిన 1.2 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆనంద్‌ రాఠి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆనంద్‌ రాఠీ, ప్రదీప్‌ గుప్తా, అమిత్‌ రాఠి, ప్రీతి గుప్తా, సుప్రియ రాఠి, రావల్‌ ఫ్యామిల్‌ ట్రస్ట్‌, జుగల్‌ మంత్రి, ఫిరోజ్‌ అజీలు ఈ షేర్లను విక్రయించనున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌, ఇతరత్రా ఆర్థిక సేవల పథకాల విక్రయాన్ని ఆనంద్‌ రాఠీ వెల్త్‌ నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని