నేడు ప్రారంభ‌మైన‌ ప‌దో విడ‌త ప‌సిడి బాండ్ల జారీ

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌దో ద‌శ‌ సార్వ‌భౌమ ప‌స‌డి బాండ్ల జారీ  నేడు జ‌న‌వ‌రి 11 న ప్రారంభ‌మైంది. జనవరి 15న‌ శుక్రవారం ఇష్యూ ముగుస్తుంది.  గ్రాము ధ‌ర రూ. 5,104 గా నిర్ణయించారు. ఆన్‌లైన్ లో కొనుగోలు  చేస్తే రూ. 50 ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబ‌డుదారుల‌కు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణులు అభిప్రాయం. దీనిలో రెండుర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీని పొందడంతో పాటు, బంగారం ధ‌ర పెరిగితే ఆ లాభాన్ని కూడా పొంద‌వ‌చ్చు.
 
2020 డిసెంబర్ 28 నుంచి 2021 జనవరి 1 వరకు జారీచేసిన‌ బాండ్ల (సిరీస్ IX) ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 5,000. ఈ సార్వ‌భౌమ ప‌సిడి బాండ్ల‌ను భారత ప్రభుత్వం తరపున ఆర్‌బీఐ జారీ చేస్తుంది.


2019, 2020 సంవత్సరాల్లో బంగారం గ‌ణ‌నీయ‌మైన‌ లాభాలను సాధించింది,  రెండంకెల వృద్ధిని న‌మోదుచేసింది. గత ఏడాది ఆగస్టులో బంగారం 10 గ్రాములకు రూ.56,200 వ‌ద్ద‌కు చేరింది. కొంతకాలంగా రూ. 48,000-52000 పరిధిలో ట్రేడవుతోంది.
  అయితే అమెరికా డాల‌ర్‌ బలోపేతం, అధిక బాండ్ల దిగుబడి కారణంగా  అంతర్జాతీయ పెట్టుబడిదారులకు బంగారాన్ని ఖరీదైనదిగా మారింది.

  అమెరికాలో పాలన మార్పులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, క‌రోనా టీకా ప్రక్రియ సమర్థత బంగారం ధరలకు మార్గనిర్దేశం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని