మూలధన సేకరణకు తక్షణ ప్రణాళికలేమీ లేవు

గత ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలు ఆర్జించిన నేపథ్యంలో, మూలధన సమీకరణ కోసం తక్షణ  ప్రణాళికలు ఏమీ రూపొందించల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా వెల్లడించారు. వ్యాపార వృద్ధికి ఆ మొత్తాన్నే వినియోగిస్తామని పేర్కొన్నారు.

Published : 08 May 2021 01:22 IST

 ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలు ఆర్జించిన నేపథ్యంలో, మూలధన సమీకరణ కోసం తక్షణ  ప్రణాళికలు ఏమీ రూపొందించల స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా వెల్లడించారు. వ్యాపార వృద్ధికి ఆ మొత్తాన్నే వినియోగిస్తామని పేర్కొన్నారు. ‘గతంలో టైర్‌-1, టైర్‌-2 బాండ్ల ద్వారా నిధులు సమీకరించాం. గత ఏడాది వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే, సౌకర్యవంతమైన మూలధన కనీస నిష్పత్తి ఉంది. ఈ ఏడాదిలో వ్యాపార వృద్ధికి అవసరమైన వనరులు ఉన్నాయ’ని దినేశ్‌ వెల్లడించారు.
* ఎస్‌బీఐ లైఫ్‌లో కార్లిలే గ్రూప్‌ 4% వాటా విక్రయం
ప్రైవేటు ఈక్విటీ సంస్థ కార్లిలే గ్రూప్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో తమకున్న 4 శాతం వాటాను రూ.3,900 కోట్లకు ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా విక్రయించినట్లు తెలిపింది. బీఎస్‌ఈ వద్ద ఉన్న సమాచారం మేరకు, కార్లిలే గ్రూప్‌ తమ సీఏ ఎమరాల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా 4.1 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లను విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని