Crypto currency: ఆర్థిక సేవలకు ‘క్రిప్టో’ను వినియోగించవచ్చు: నందన్‌ నిలేకని

బెంగళూరు: క్రిప్టో ఆస్తులను పరిగణనలోకి తీసుకోని ఆర్థిక సేవలకు వినియోగించవచ్చని ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు.. సంస్థ ఛైర్మన్‌ నందన్‌ నిలేకని అభిప్రాయపడ్డారు. అయితే, నగదు బదిలీకి ఇది అక్రమమార్గంగా మారకూడదన్నారు. వీటిని ఆర్థిక వ్యవస్థలోకి యువతను ఆహ్వానించే ప్రవేశమార్గాలుగా ఉపయోగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై బిల్లు తీసుకొస్తున్న వేళ నందన్‌ నిలేకని ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘క్రిప్టో కరెన్సీని ధనంగా కాకుండా ఆస్తులుగా పరిగణించి.. చట్టబద్ధమైన క్రిప్టో మార్కెట్‌ను తీసుకురావాలి. అలా చేస్తే యువత క్రిప్టోకు సంబంధించి వినూత్న ఆవిష్కరణలు చేయగలదు. తద్వారా అంతర్జాతీయ స్థాయి కంపెనీలను సృష్టించగలదు. మరో విషయమేమిటంటే.. క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు తగినది కాదు. ఎందుకంటే.. క్రిప్టో కరెన్సీ విలువ అస్థిరంగా ఉంటుంది. అలాగే, వీటి లావాదేవీలకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే’ అని ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నిలేకని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 1.5 - 2 కోట్ల మంది క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నారని.. వాటి విలువ రూ. 40వేల కోట్లు ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని