ప్రయాణ తేదీ మార్పునకు రుసుము లేదు: స్పైస్‌జెట్‌

స్పైస్‌జెట్‌ విమాన ప్రయాణికులకు ‘జీరో ఛేంజ్‌ ఫీ’ పేరుతో ఒక ఆఫర్‌ ప్రకటించింది. ప్రయాణికులు ప్రయాణ తేదీ లేదా ....

Published : 01 Apr 2021 01:07 IST

దిల్లీ: స్పైస్‌జెట్‌ విమాన ప్రయాణికులకు ‘జీరో ఛేంజ్‌ ఫీ’ పేరుతో ఒక ఆఫర్‌ ప్రకటించింది. ప్రయాణికులు ప్రయాణ తేదీ లేదా పేర్లను మార్చుకోవాలంటే ఎలాంటి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, ప్రయాణ తేదీకి కనీసం 7 రోజుల ముందు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఏప్రిల్‌ 4 వరకు బుకింగ్‌ చేసుకొని, జూన్‌ 30లోపు చేసే ప్రయాణాలకే ఈ ఆఫర్‌ ఉంటుందని వెల్లడించింది.

ప్రభుత్వ ఖజానాకు రూ.32,835 కోట్లు
సవరించిన లక్ష్యం దాటిన పెట్టుబడుల ఉపసంహరణ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈలు) వాటా విక్రయం, బైబ్యాక్‌ల ద్వారా ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) రూ.32,835 కోట్ల పెట్టుబడుల్ని సమీకరించింది. 2020 బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.2.10 లక్షల కోట్లుగా ప్రభుత్వం నిర్దేశించుకోగా, కరోనా మహమ్మారి పరిణామాలతో దాన్ని తర్వాత రూ.32,000 కోట్లకు సవరించింది. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని అధిగమించింది. ‘2020-21లో ప్రభుత్వ ఖజానాకు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.32,835 కోట్లు, డివిడెండ్‌ రూపంలో రూ.39,022 కోట్లు వచ్చాయ’ని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. సీపీఎస్‌ఈల డివిడెండ్‌ సవరించిన లక్ష్యం రూ.34,717 కోట్లను అధిగమించి రూ.39,022 కోట్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఈ రూపంలో రూ.35,543 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకొంది. ఎల్‌ఐసీ ఐపీఓ, ఐడీబీఐ బ్యాంక్‌, ఎయిరిండియా, బీపీసీఎల్‌, పవన్‌హాన్స్‌, బీఈఎంఎల్‌, ఎన్‌ఐఎన్‌ఎల్‌, షిప్పింగ్‌ కార్ప్‌ వంటి సంస్థల ప్రైవేటీకరణ ఇందుకు సహకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని