ఆ 3 చైనా కంపెనీల డీలిస్టింగ్‌ లేదు

చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీల షేర్లను డీలిస్ట్‌ చేయాలన్న నిర్ణయాన్ని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌వైఎస్‌ఈ) వెనక్కి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల

Published : 06 Jan 2021 04:24 IST

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిర్ణయం

బీజింగ్‌: చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీల షేర్లను డీలిస్ట్‌ చేయాలన్న నిర్ణయాన్ని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌వైఎస్‌ఈ) వెనక్కి తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ షేర్లను తొలగించాల్సి ఉంది. అయితే నియంత్రణ సంస్థలతో ‘తదుపరి చర్చల’ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తొలుత పేర్కొన్న ఎక్స్ఛేంజీ, సోమవారం రాత్రి ఈ ప్రకటన చేసింది. ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈ ప్రకటనతో ఈ మూడు కంపెనీల షేర్లు 5-11% దాకా దూసుకెళ్లాయి. మరోవైపు, విదేశీ కంపెనీలను తొక్కిపెడుతున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం అమెరికాను విమర్శించింది. ‘ఇలా చేయడం వల్ల చైనా కంపెనీలపై చాలా తక్కువ ప్రభావం పడుతుంది. అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలను, ప్రతిష్ఠను ఇది దెబ్బ తీస్తుంద’ని పేర్కొంది. నవంబరు నాటి ట్రంప్‌ అధికారిక ఉత్తర్వుల మేరకు చైనా టెలికాం కార్ప్‌, చైనా మొబైల్‌, చైనా యునికామ్‌ హాంకాంగ్‌లను డీలిస్ట్‌ చేయనున్నట్లు ఎన్‌వైఎస్‌ఈ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని