Recruitments: వచ్చే 6 నెలల్లో ఈ టెక్‌ కంపెనీల్లో భారీ ఉద్యోగాలు!

ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన ఐటీ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఉద్యోగుల వలసల రేటు అధికంగా ఉన్నందున, గతేడాది చేపట్టిన..

Published : 20 Aug 2021 10:41 IST

ఎల్‌టీఐలో 4500 మంది ఫ్రెషర్లు..: ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌నకు చెందిన ఐటీ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ (ఎల్‌టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. ఉద్యోగుల వలసల రేటు అధికంగా ఉన్నందున, గతేడాది చేపట్టిన 3000 నియామకాలతో పోలిస్తే ఈ సారి అధికంగా చేపట్టనున్నట్లు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ జలోనా పేర్కొన్నారు.

ఓయోలో..: వచ్చే ఆరు నెలల్లో ప్రారంభ స్థాయి నుంచి సీనియర్‌ నాయకత్వ పదవుల్లో 300కు పైగా టెక్నాలజీ నిపుణులను నియమించుకోనున్నట్లు ఆతిథ్య సేవల సంస్థ ఓయో వెల్లడించింది. మెషీన్‌ లెర్నింగ్, డేటా ఇంజినీరింగ్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డెవలపర్లు.. వంటి విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారిని కంపెనీ బృందాల్లో చేర్చుకోవడానికి చూస్తున్నట్లు తెలిపింది. పలు వినూత్నతలు తీసుకురావడానికి సిద్ధమైన కంపెనీ.. టెక్నాలజీపై పెట్టుబడులు, హోటల్‌ భాగస్వాములకు ఆదాయం పెంచడం, వినియోగదారులకు మెరుగైన సేవలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.

బోర్డ్‌ ఇన్ఫినిటీలో..: వచ్చే ఆరు నెలల్లో 2000 మందిని ప్రాంగణ ఎంపికల ద్వారా నియమించుకుంటామని ఎడ్‌టెక్‌ సంస్థ బోర్డ్‌ ఇన్ఫినిటీ తెలిపింది. 2022 చివరికి ‘చెల్లింపుపై అభ్యసించే వారి సంఖ్య’ను 3 లక్షలకు పెంచుకోవడమే లక్ష్యమని వెల్లడించింది. టెక్నాలజీ, డిజిటల్‌ మార్కెటింగ్, అమ్మకాలు వంటి విభాగాల్లో నియమించుకోనున్నట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని