UPI: నేరుగా కాంటాక్ట్‌కే చెల్లింపులు

న‌గ‌దు స్వీక‌రించేవారు ఫోన్‌పే, గూగుల్-పే లేదా పేటీఎం ఏ యూపీఐ యాప్‌కైనా పంపించ‌వచ్చు

Updated : 13 Jul 2021 17:10 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ (ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్) లావాదేవీలను క్ష‌ణాల్లో సుల‌భంగా చేయడానికి బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ మూడు బ్యాంకులు 'పే టు కాంటాక్ట్' (మీ కాంటాక్ట్‌కు చెల్లించండి) ఫీచర్‌ను ప్రారంభించాయి. ఇది మొబైల్ చెల్లింపులను గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

దీనికోసం మొదట యాప్ ఓపెన్ చేసి "పే టు కాంటాక్ట్" ఎంపికపై క్లిక్ చేయాలి. అక్క‌డ మీ కాంటాక్ట్ నంబ‌ర్‌లు క‌నిపిస్తాయి.  ఎవ‌రికి డ‌బ్బు పంపించాల‌నుకుంటున్నారో వారి కాంటాక్ట్ నంబ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు. ఈ ప్రాసెస్‌లోనే కాంటాక్ట్‌కు సంబంధించిన యూపీఐ అడ్ర‌స్‌ను ఆటోమేటిక్‌గా యాప్ గుర్తిస్తుంది. మీరు చేయాల్సింద‌ల్లా యూపీఐ అడ్ర‌స్ చెక్‌చేసుకొని.. న‌గ‌దు , పాస్‌వ‌ర్ట్ ఎంట‌ర్ చేసి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగ‌దారులు అయితే, రిసీవర్ ఉపయోగిస్తున్న యాప్‌ను కూడా చూడవచ్చు. న‌గ‌దు స్వీక‌రించేవారు ఫోన్‌పే, గూగుల్-పే లేదా పేటీఎం ఏ యూపీఐ అడ్ర‌స్‌నైనా యాప్ గుర్తిస్తుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఫండ్ బదిలీ, చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకు ఖాతా సంఖ్య‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను నమోదు చేసే ఇబ్బంది లేకుండా ఈ యూపీఐ విధానం చెల్లింపుల‌ను సుల‌భ‌త‌రం చేసింది. అంత‌కుముందు డబ్బు పంపించాల్సిన వ్యక్తి, డ‌బ్బు స్వీక‌రించేవారి  వ‌ర్చువ‌ల్ అడ్ర‌స్ వంటివి న‌మోదు చేయాల్సి ఉండేది.

మొబైల్ చెల్లింపులపై దృష్టి సారించే యాప్‌లు డబ్బు బదిలీలను మరింత సౌకర్యవంతంగా చేశాయి. డ‌బ్బును స్వీక‌రించేవారు ఒకే యాప్ ఉప‌యోగిస్తే నేరుగా కాంటాక్ట్‌కు బదిలీ చేయవచ్చు. మీరు యూపీఐ ఐడీని నమోదు చేయకుండా గూగుల్-పే ఉపయోగించి మీరు మరొక వ్యక్తికి డబ్బు పంపవచ్చు.

'పే టు కాంటాక్ట్' ఫీచర్‌తో బ్యాంకులు ఇప్పుడు దానిని తదుపరి స్థాయి సౌలభ్యానికి తీసుకువెళ్ళాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 10 సార్లు వరకు లావాదేవీలు చేయవచ్చు, రోజుకు మొత్తం రూ. 50,000 వరకు పంపించ‌వ‌చ్చు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక వినియోగదారు రోజుకు రూ.1 లక్ష వరకు, గరిష్ఠంగా 10 లావాదేవీలు చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని