పన్ను మినహాయింపులకు కొన్ని నిబంధనలు
దీర్ఘకాలిక పెట్టుబడులు కాల పరిమితి కన్నా ముందే రద్దు చేసినట్లయితే పన్ను మినహాయింపులు వర్తించక పోవచ్చు.. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తికి ఆదాయపు పన్ను చట్టం 1961 కింద ప్రతి సంవత్సరం కొంత మినహాయింపు వస్తుంది. సాధారణంగా సెక్షన్ 80సి ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎప్)..
దీర్ఘకాలిక పెట్టుబడులు కాల పరిమితి కన్నా ముందే రద్దు చేసినట్లయితే పన్ను మినహాయింపులు వర్తించక పోవచ్చు.. ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తికి ఆదాయపు పన్ను చట్టం 1961 కింద ప్రతి సంవత్సరం కొంత మినహాయింపు వస్తుంది. సాధారణంగా సెక్షన్ 80సి ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎప్), జీవిత బీమా పాలసీ, ఈక్విటీ లింక్డ్ పదుపు పథకాలు, ప్రజా భవిష్య నిధి, ఐదు సంవత్సరాల బ్యాంకు, పోస్టాఫీసుల ఫిక్సిడ్ డిపాజిట్లపై,ఇంటి కోసం తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం వంటి వాటిపై రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు వుంటుంది. గృహ రుణంపై వడ్డీ చెల్లించేప్పుడు రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మీరు మొదటి సంవత్సరం పన్ను మినహాయింపు పొందడానికి ఇచ్చిన నిబంధనలను తరువాతి సంవత్సరాలలో కూడా అమలు పరిచినప్పుడు మాత్రమే మీరు మినహాయింపులు పొందుతారు. |
సాధారణంగా పన్ను మినహాయింపు వర్తించేందుకు నిబంధనలు
బ్యాంకు రుణం ద్వారా కొనుగోలు చేసిన ఇంటిని అమ్మినప్పుడు: మీరు ఇంటిని కొనుగోలు చేసే నిమిత్తం బ్యాంకులో గృహ రుణం తీసుకున్నట్లయితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి ప్రకారం రూ. 1.5 లక్షల వరకు క్లైం చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 24బి ప్రకారం ప్రతి సంవత్సరం చెల్లించే వడ్డీపై రెండు లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇంటిని కొనుగోలు చేసిన 5 సంవత్సరాలలోపు అమ్మినట్లయితే, ఈ కాలంలో రుణ చెల్లింపుపై పొందిన పన్ను మినహాయింపు, అమ్మిన సంవత్సర ఆదాయంతో చేర్చి పన్ను లెక్కించబడుతుంది. గృహ రుణం వడ్డీపై మినహాయింపు పొందవచ్చు.
ప్రారంభ సంవత్సరాలలో ఇంటిని అమ్మాలనుకున్నప్పుడు దీర్ఘకాలంలో వచ్చే లాభాలను అంచానా వేసుకోవాలి. లేదంటే ఇల్లు అమ్మ ప్పుడు వచ్చే లాభం పన్ను చెల్లించడంలో పొయే అవకాశం వుంది.
ఉద్యోగ భవిష్య నిధిని 5 సంవత్సరాల లోపుల తీసుకున్నప్పుడు..
ఈపిఎఫ్ కింద ఉద్యోగులకు సెక్షన్ 80సి ప్రకారం సంవత్సరానికి 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి కావడానికి ముందే ఈపిఎఫ్ తీసుకున్నట్లయితే ముందు సంవత్సరాలకు లభించిన మినహాయింపు మొత్తాన్ని ఈపిఎఫ్ తీసుకున్న సంవత్సరం పన్నులో చెల్లించాల్సి వుంటుంది. మినహాయింపు వచ్చిన ముందు సంవత్సరాల మీద సంస్థ చెల్లించిన భాగంపై వడ్డీ వచ్చినట్లయితే అది ఇతర ఆదాయం కింద పరగణించబడి ఆ వడ్డీపై కూడా పన్ను విధిస్తారు. ఉద్యోగి ఆరోగ్య సమస్య, సంస్థ మూసివేయడం వంటి ఉద్యోగి చేతుల్లో లేని కారణాల వలన ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు.
జీవిత బీమా సరండర్ చేస్తే: హిందూ అవిభాజ్య కుటుంబంలో వ్యక్తి తన పేరుతో గాని తన భార్య పిల్లల పేర్లతో గాని జీవిత బీమాను తీసుకున్నప్పుడు మొదటి సంవత్సరానికి లేదా రినీవల్ చేసినప్పుడు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. మిగిలిన వారి పేర్లతో పాలసీ తీసుకున్నట్లయితే పన్ను మినహాయింపు వర్తించదు.
పాలసీకి చెల్లించిన ప్రమీయంతో సంబంధం లేకుండా పెట్టుబడి మొత్తానికి ఇచ్చిన హామీపై పన్ను మినహాయిపు లభిస్తుంది. ఇది బీమా పొందిన మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రస్తుతం బీమా మొత్తంపై 10 శాతం వరకు ఉంది. ఏప్రియల్ 1, 2012కు ముందు తీసుకున్న పాలసీలకు 20 శాతం ఉంటుంది.
ఒక వేళ రెండు సంవత్సరాల లోపు పాలసీని తిరిగి ఇచ్చివేసినట్లయితే ముందు సంవత్సరాలలో పొందిన మినహాయింపులు పాలసీ తిరిగిచ్చిన సంవత్సరం పన్నుపరిధిలోనికి వస్తాయి. అంతేకాకుండా ఒక సంవత్సరంలో పాలసీని రద్దు చేస్తే బీమా సంస్థలు కూడా ప్రీమియం మొత్తాన్ని తీసివేస్తాయి. రెండు, మూడు సంవత్సరాలలో పాలసీ రద్దు చేసినట్లయితే బీమా సంస్థలు, కట్టిన ప్రీమియంలో 30 శాతం వరకు తిరిగి చెల్లిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్