Fixed Deposits: ఎఫ్‌డీపై 6.75 శాతం వ‌డ్డీ అందిస్తున్న బ్యాంకులివే...

జ‌న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్క‌ర్ష్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఒక సంవ‌త్స‌రం ఎఫ్‌డీపై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 6.25 శాతం, సినియ‌ర్ సిటిజ‌న్ల‌కు 6.75శాతం వ‌డ్డీని అందిస్తున్నాయి

Updated : 18 Oct 2021 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి పెట్టిన మొత్తంపై స్థిర‌మైన రాబ‌డి ఉంటుంది. అలాగే న‌ష్ట‌భ‌యం కూడా త‌క్కువ‌. అందువ‌ల్లే రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని వారు ఇందులో మ‌దుపు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే గ‌త కొంత కాలంగా చూసుకుంటే ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఎఫ్‌డీల‌ను స్వ‌ల్ప‌కాలిక పెట్టుబ‌డి మార్గంగా ఎంచుకునే వారిపై ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌లోనూ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల‌తో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎఫ్‌డీల‌పై మెరుగైన వ‌డ్డీని అందిస్తున్నాయి. జ‌న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో పాటు ఉత్క‌ర్ష్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ఏడాది ఎఫ్‌డీపై సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు 6.25 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 6.75 శాతం వ‌డ్డీని అందిస్తున్నాయి.

రూ. 2 కోట్లలోపు ఎఫ్‌డీ డిపాజిట్ల‌పై జ‌న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఆఫ‌ర్ చేస్తున్న వ‌డ్డీ రేట్లు..
7 నుంచి 14 రోజుల డిపాజిట్ల‌పై ... 2.50 శాతం
15 నుంచి 60 రోజుల డిపాజిట్ల‌పై ... 3 శాతం
61 నుంచి 90 రోజుల డిపాజిట్ల‌పై ... 3.75 శాతం
91 నుంచి 180 రోజుల డిపాజిట్ల‌పై ... 4.50 శాతం
181 నుంచి 364 రోజుల డిపాజిట్ల‌పై ... 5.50 శాతం
ఒక సంవ‌త్స‌రం లేదా 365 రోజుల డిపాజిట్ల‌పై ... 6.25 శాతం
ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్ల‌పై ... 6.50 శాతం
రెండేళ్ల‌ నుంచి మూడేళ్ల‌ డిపాజిట్ల‌పై ... 6.50శాతం
మూడేళ్ల నుంచి ఐదేళ్ల డిపాజిట్ల‌పై అత్య‌ధికంగా 6.75 శాతం
5సంవ‌త్స‌రాలు లేదా 1825 రోజుల డిపాజిట్ల‌పై 6.50 శాతం
5ఏళ్ల కంటే ఎక్కువ 10ఏళ్ల లోపు డిపాజిట్ల‌పై 6 శాతం వ‌డ్డీని బ్యాంక్ అందిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే వ‌డ్డీ రేట్ల కంటే 0.50శాతం అద‌న‌పు వ‌డ్డీని అందిస్తోంది. బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం ఈ వ‌డ్డీ రేట్లు మే 7, 2021 నుంచి అమ‌ల్లో ఉన్నాయి.

రూ.2 కోట్ల లోపు దేశీయ‌ ఎఫ్‌డీ డిపాజిట్ల‌పై ఉత్క‌ర్ష్‌ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు..
7 నుంచి 45 రోజుల డిపాజిట్ల‌పై ... 3 శాతం
46 నుంచి 90 రోజుల డిపాజిట్ల‌పై ... 3.25 శాతం
91 నుంచి 180 రోజుల డిపాజిట్ల‌పై ... 4 శాతం
181 నుంచి 364 రోజుల డిపాజిట్ల‌పై ... 5.75 శాతం
365 రోజుల నుంచి 699 రోజుల‌ డిపాజిట్ల‌పై ... 6.25 శాతం
700 రోజుల డిపాజిట్ల‌పై అత్య‌ధికంగా ... 6.75 శాతం
701 రోజుల నుంచి 3652 రోజుల డిపాజిట్ల‌పై ...6 శాతం వ‌డ్డీని బ్యాంక్ అందిస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించే వ‌డ్డీ రేట్ల కంటే 0.50శాతం అద‌న‌పు వ‌డ్డీని అందిస్తోంది. బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం ఈ వ‌డ్డీ రేట్లు జులై1, 2021 నుంచి అమ‌ల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని