సేవింగ్స్ ఖాతా తెరుస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి 

బ్యాంకు ఖాతాను తీసుకోవాల‌నుకుంటున్నవారు.. ఏ బ్యాంకులో ఖాతా తీసుకోవ‌డం మంచిది? ఏ బ్యాంకు ఎక్కువ వ‌డ్డీ రేటు ఆఫ‌ర్ చేస్తుంది అని చూస్తుంటారు. అయితే ఖాతా కోసం బ్యాంకును ఎంచుకునేప్పుడు వ‌డ్డీ రేటు ఒక్క‌టే చూడ‌డం మంచిది కాదు. చాలా బ్యాంకులు ఖాతాదారుల‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా పొదుపు ఖాతాల‌ను అందిస్తున్నాయి. ఖాతాలో ఎక్కువ బ్యాలెన్స్‌ను నిర్వ‌హించేవారికి మెరుగైన సేవ‌ల‌ను అందిస్తున్నాయి. 

మీరు తీసుకునే ఖాతా ర‌కంపై ఆధార‌ప‌డి, పేర్కొన్న బ్యాలెన్స్‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఇది ఒక బ్యాంక్ నుంచి మ‌రొక బ్యాంక్‌కు మారుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు, స్మాల్ ఫినాన్స్ బ్యాంకుల‌లో ఖాతా ఉన్నవారు.. మెట్రో న‌గరాల‌లో అయితే రూ.5వేలు, మెట్రోయేత‌ర న‌గ‌రాల‌లో అయితే రూ.2500 చొప్పున నెల‌వారి స‌గ‌టు బ్యాలెన్స్‌(ఎమ్ఏబీ) నిర్వ‌హించ‌మ‌ని ఖాతాదారుల‌ను కోరుతున్నాయి. 

మెట్రో న‌గ‌రాల్లో ఉండే వారు పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఖాతా తెరిస్తే రూ.10వేల నుంచి రూ.15 వేల నెల‌వారి స‌గ‌టు బ్యాలెన్స్‌ నిర్వ‌హించాల్సి ఉంటుంది.  సెమీ-అర్బ‌న్ ప్రాంతాల‌లో నివ‌సించేవారు రూ.500 నుంచి రూ.1000 ఎమ్ఏబీ ఖాతాలో ఉంచాలి.  ప్రైవేట్ బ్యాంకుల‌తో పోలిస్తే,  ప్ర‌భుత్వ బ్యాంకులో ఎమ్ఏబీ నిర్వ‌హ‌ణ త‌క్కువ‌గా ఉంటుంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. ఇందులో నో-ఫ్రిల్ ఖాతాతో పాటు సాధార‌ణ పొదుపు ఖాతా, సేవింగ్స్ ప్ల‌స్ ఖాతా, ప్రీమియం పొదుపు ఖాతా వంటివి అందుబాటులో ఉన్నాయి.  

నో-ఫ్రిల్ ఖాతా,  బేసిక్‌ పొదుపు ఖాతాల‌ను జిరో క‌నీస బ్యాలెన్స్‌తో అందిస్తుంది ఎస్‌బీఐ. గ‌రిష్ట ప‌రిమితి లేదు. అయితే చెక్‌బుక్ ఉచితంగా ల‌భించ‌దు. బ్యాంకు బ్రాంచ్‌లు లేదా ఏటీఎమ్‌ల‌ వ‌ద్ద మాత్ర‌మే ఉచితంగా విత్‌డ్రా చేసుకునే వీలుంది. ఖాతాదారునికి రూపే ఏటీఎమ్‌-క‌మ్ డెబిట్ కార్డు ల‌భిస్తుంది. 

సాధార‌ణ పొదుపు ఖాతా..
పొదుపు ఖాతాను ఎంచుకున్న వారికి అన్ని సేవ‌ల‌ను అందిస్తుంది బ్యాంక్‌. వీటితో పాటు మొబైల్ బ్యాంకింగ్‌, ఎస్ఎమ్ఎస్ అల‌ర్ట్స్‌, ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం 10 చెక్ లీఫ్‌లు అందిస్తుంది. ఖాతాదారులు త‌మ ఖాతాను ఆన్‌లైన్‌లో బ‌దిలీ చేయ‌వ‌చ్చు. క‌నీస బ్యాలెన్స్ నిర్వ‌హించాల్సి అవ‌స‌రం కూడా లేదు. 

సేవింగ్స్ ప్ల‌స్ ఖాతా..
ఇందులో బ్యాంక్ ఖాతాను డిపాజిట్ ప‌థ‌కానికి అనుసంధానిస్తారు. నిర్ధిష్ట పరిమితికి మించి ఖాతాలో బ్యాలెన్స్ ఉన్న‌ప్పుడు, అద‌నంగా ఉన్న మొత్తం స్వ‌యం చాలాకంగా డిపాజిట్‌కు బ‌దిలీ అవుతుంది.  పొదుపు ఖాతాలో ఉన్న అన్ని సేవ‌ల‌తో పాటు, ఖాతాకు లింక్ చేసిన డిపాజిట్‌పై రుణం పొందచ్చు. 25 ఉచిత చెక్ లీఫ్‌ల‌ను కూడా ఇస్తారు. ఖాతాకు లింక్ అయిన డిపాజిట్‌పై అధిక వ‌డ్డీని పొంద‌చ్చు.

ప్రీమియం ఖాతాలు..
ఒక ఖాతాదారునికి వ్య‌క్తిగ‌తంగా బ్యాంకుతో రూ.30ల‌క్ష‌ల బంధం ఉంటే.. అంటే  ఫిక్స్‌డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్‌, డిమ్యాట్ మొత్తం క‌లిపి బ్యాంకు ఖాతాలోని డ‌బ్బు ఈ ప‌రిమితికి ఉండాలి. కొత్త ఖాతాదారులు ప్రారంభ డిపాజిట్ 10 ల‌క్ష‌ల‌తో 12 నెల‌ల్లో ఈ రూ.30ల‌క్ష‌ల బంధాన్ని చేర‌వ‌చ్చు. బ్యాంక్ వెబ్‌సైట్ ప్ర‌కారం, నెల‌వారి జీతం రూ.2 ల‌క్ష‌లు అంత‌కు మించి ఉన్న‌వారు, గృహ రుణ విలువ‌ రూ.1కోటి మించి ఉన్న‌వారికి ఇది అందుబాటులో ఉంది. 

చివ‌రిగా..
పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంకుల‌లో.. ఆన్‌లైన్ ద్వారా త‌క్ష‌ణ‌మే పొదుపు ఖాతాను పొంద‌వ‌చ్చు. మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక పొదుపు ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి షాపింగ్‌పై చాలా ప్ర‌యోజ‌నాలను ఇస్తున్నాయి. 18 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు పొదుపు అల‌వాటు చేసేందుకు కూడా పొదుపు ఖాతాల‌ను అందిస్తున్నాయి బ్యాంకులు. పెన్ష‌న్ అవ‌స‌రాల కోసం సీనియ‌ర్ సిట‌జ‌న్ల‌కు పొద‌పు ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. ఖాతాను తీసుకునే ముందు నెల‌వారి నిర్వ‌హించాల్సిన స‌గ‌టు బ్యాలెన్స్, ఖాతా రకం వంటి వాటిని తెలుసుకుని ఖాతాను తీసుకోవ‌డం మంచిది. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని