బడ్జెట్‌ ప్రసంగంలో తిరువళ్లువర్ వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్‌, గురుదేవ్‌ రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమిళకవి తిరువళ్లువర్‌ ‘కురల్‌’ అనే గ్రంథంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ‘ రాజు లేదా పాలకుడు తన రాజ్యంలో సంపదను సృష్టించడం లేదా సమీకరిస్తుంటాడు....

Published : 01 Feb 2021 16:12 IST

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్‌, గురుదేవ్‌ రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమిళకవి తిరువళ్లువర్‌ ‘కురల్‌’ అనే గ్రంథంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ‘ రాజు లేదా పాలకుడు తన రాజ్యంలో సంపదను సృష్టించడం లేదా సమీకరిస్తుంటాడు. దీన్ని భద్రతగా కాపాడటంతో పాటు సమాజ సంక్షేమానికి వినియోగించాలి’ అన్న మాటలను ఆమె తన ప్రసంగంలో ఉటంకించారు. భారత్‌లో పన్నుల విధానం సమర్థవంతంగా ఉండటంతో పాటు పారదర్శకంగా ఉండాలన్నారు. ఇది కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలనలో కీలకమన్నారు.

అలాగే గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ఠాగూర్‌ రాసిన గ్రంథంలోని ‘విశ్వాసమనేది ఒక పక్షి లాంటిది, దీపాన్ని చూసి ఉదయమైందని భావించి కిలకిలారావాలు చేస్తుంది. భారత్‌ బ్రిటిషువారి నుంచి విముక్తి పొంది కొత్తశకాన్ని ప్రారంభించింది. స్వేచ్ఛావాయువులతో నూతన ప్రయాణాన్ని ప్రారంభించిన భారత్‌ ప్రజలు తనపై ఉంచి కోట్లాది ఆశలకు హామీ ఇస్తూ ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది’ తదితర వ్యాఖ్యలను నిర్మలా సీతారామన్‌ ఉటంకించారు. కేంద్ర ఆర్థికమంత్రులు తమ బడ్జెట్‌ ప్రసంగాల్లో ప్రముఖ కవులు రాసిన వ్యాక్యాలను ఉటంకించడం ఇదే ప్రథమం కాదు. గతంలో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనూ తిరువళ్లువర్‌ వ్యాఖ్యలను తన ప్రసంగంలో పేర్కొనేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని