
భారత దిగ్గజ కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: 1991లో నాటి ప్రధాని పి.వి.నర్సింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలు భారతదేశ రూపురేఖల్నే మార్చేశాయి. అప్పటి వరకు లైసెన్స్‌రాజ్ వ్యవస్థతో కునారిల్లుతున్న దేశీయ ప్రైవేటు రంగం.. ఒక్కసారిగా జూలు విదిల్చింది. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన అనేక కంపెనీలు వ్యాపారంలో భారతదేశ సత్తా ఏంటో చాటాయి. రూ.లక్షల కోట్ల సంపదను సృష్టిస్తూ అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదిగాయి. ముఖ్యంగా ఐటీ సేవల్లో భారత్‌కు తిరుగులేకుండా పోయింది.
అయితే, 2008లో ఆర్థిక సంక్షోభం, 2019 కరోనా సంక్షోభం వల్ల కంపెనీల ఆర్థిక పరిస్థితి కొంతమేర కుంటుపడింది. అయినప్పటికీ.. బలమైన పునాదుల కారణంగా వేగంగా కోలుకున్నాయి. అయితే, కొన్ని సంస్థలు కరోనా సంక్షోభాన్ని సైతం తట్టుకొని రాణించాయి. కొన్ని కంపెనీలు గణనీయ స్థాయిలోనే లాభాల్ని ఆర్జిస్తున్నాయి. మరి లాభార్జనలో ముందున్న తొలి 10 కంపెనీలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో చూద్దామా..!
తిరుగులేని రిలయన్స్
ఆసియాలోనే అత్యంత కుబేరుడు.. ఇటీవలే 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్).. లాభార్జనలో తొలిస్థానంలో ఉంది. నిమిషానికి ఈ కంపెనీ రూ.9.34 లక్షలు సంపాదిస్తోంది. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ కంపెనీ చమురు శుద్ధి, రసాయనాలు, టెలికాం, స్వచ్ఛ ఇంధన సహా మరికొన్ని రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది.
టీసీఎస్
ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ టాటా గ్రూప్ సంస్థల్లో ప్రధానమైంది. నాణ్యతకు పెట్టింది పేరైనా ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఐటీ సేవల్ని అందిస్తోంది. ఈ కంపెనీ నిమిషానికి రూ.6.17 లక్షల లాభాల్ని ఒడిసిపడుతుండడం విశేషం.
సంస్థ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన కేంద్రం: ముంబయి
విభాగం: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు నిమిషానికి లాభం: రూ.6.05 లక్షలు
సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కేంద్రం: ముంబయి
విభాగం: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు నిమిషానికి లాభం: రూ.4.26 లక్షలు
సంస్థ: ఇండియన్ ఆయిల్ ప్రధాన కేంద్రం: ముంబయి
విభాగం: ఇంధనం నిమిషానికి లాభం: రూ.4.11 లక్షలు
సంస్థ: ఇన్ఫోసిస్ ప్రధాన కేంద్రం: బెంగళూరు
విభాగం: ఐటీ సేవలు నిమిషానికి లాభం: రూ.3.68 లక్షలు
సంస్థ: హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రధాన కేంద్రం: ముంబయి
విభాగం: ఆర్థిక సేవలు నిమిషానికి లాభం: రూ. 3.56 లక్షలు
సంస్థ: ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన కేంద్రం: వడోదరా
విభాగం: బ్యాంకింగ్, ఆర్థిక సేవలు నిమిషానికి లాభం: రూ. 3.49 లక్షలు
సంస్థ: ఓఎన్జీసీ ప్రధాన కేంద్రం: దిల్లీ
విభాగం: ఇంధనం నిమిషానికి లాభం: రూ. 3.09 లక్షలు
సంస్థ: భారత్ పెట్రోలియం ప్రధాన కేంద్రం: ముంబయి
విభాగం: ఇంధనం నిమిషానికి లాభం: రూ. 3.07 లక్షలు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యోగి ఆదిత్య నాథ్
-
Related-stories News
Kerala: కేరళలోని దుకాణంలో ఆసక్తికరమైన చోరీ..
-
Ap-top-news News
TS TET Results 2022: తెలంగాణ టెట్‌లో ప్రకాశం యువతికి మొదటి ర్యాంకు
-
Related-stories News
Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
-
Ts-top-news News
Hyderabad News: భాజపాకు రూ.20 లక్షలు.. తెరాసకు రూ.3 లక్షలు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Assigned: ఎసైన్డ్ వ్యవసాయ భూములపై యాజమాన్య హక్కులు?