Published : 25 Dec 2021 20:00 IST

Jio offer: జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌.. ఆ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ జియో తమ యూజర్లకు కొత్త ఆఫర్‌ ప్రకటించింది. రూ.2,545 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 336 రోజులే కాగా.. ఆఫర్‌ కింద 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. జనవరి 2 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఈ ప్లాన్‌తో రీఛార్జి చేసుకున్న వారికి రోజుకు 1.5 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం జియో కల్పిస్తోంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. దీర్ఘకాలం ప్లాన్‌ తీసుకోవాలనుకునే వారికి ఈ రీఛార్జి ప్లాన్‌ ఉపకరిస్తుంది. ప్రస్తుత యూజర్లతో పాటు, కొత్తగా జియో సిమ్‌ తీసుకున్న వారికి సైతం ఈ ప్లాన్‌ వర్తిస్తుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని