రిక‌రింగ్ డిపాజిట్ల గురించి తెలుసుకోవాల్సిన మూడు విష‌యాలు

రిక‌రింగ్ డిపాజిట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివే. డిపాజిట్‌పై వ‌డ్డీ రేట్లు కాల‌ప‌రిమితి, వ‌య‌స్సుపై ఆధ‌రాప‌డి ఉంటాయి. సీనియ‌ర్‌ సిటిజ‌న్ల‌క‌యితే వ‌డ్డీ రేట్లు 0.50 శాతం ఎక్కువ‌గా ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌కు, రిక‌రింగ్ డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్లు దాదాపుగా స‌మానంగా ఉంటాయి....

Updated : 02 Jan 2021 15:11 IST

రిక‌రింగ్ డిపాజిట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివే. డిపాజిట్‌పై వ‌డ్డీ రేట్లు కాల‌ప‌రిమితి, వ‌య‌స్సుపై ఆధ‌రాప‌డి ఉంటాయి. సీనియ‌ర్‌ సిటిజ‌న్ల‌క‌యితే వ‌డ్డీ రేట్లు 0.50 శాతం ఎక్కువ‌గా ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌కు, రిక‌రింగ్ డిపాజిట్ల‌కు వ‌డ్డీ రేట్లు దాదాపుగా స‌మానంగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ ఏడాది రిక‌రింగ్ డిపాజిట్‌కు 7 శాతం వ‌డ్డీ రేటు అందిస్తుంది. దీనిలో రూ.1,000 చొప్పున 12 నెల‌లు డిపాజిట్ చేస్తే సంవ‌త్స‌రానికి రూ.464 వ‌డ్డీతో క‌లిపి రూ.12,465 జ‌మ‌వుతుంది. ఇదే కాలంలో సీనియ‌ర్ సిటిజ‌న్లకు 7.50 శాతం వ‌డ్డీ రేటుతో రూ.12,499 జ‌మ‌వుతుంది.

ఖాతా మ‌ధ్య‌లో నిలిపేస్తే?

ఖాతాను మ‌ధ్య‌లో నిలిపివేయాల‌నుకుంటే కొన్ని బ్యాంకులు జ‌రిమానా విధిస్తాయి. సాధార‌ణంగా ఇచ్చే వ‌డ్డీ రేట్ల కంటే త‌క్కువ‌గా అందిస్తాయి. దీంతో పాటు అధ‌నంగా 0.5 శాతం వ‌డ్డీ బ్యాంకుల‌కు చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఇప్పుడు రిక‌రింగ్ డిపాజిట్ వ‌డ్డీ రేటు 7 శాతం అనుకుంటే, గ‌డువు ముగియ‌క‌ముందే విత్‌డ్రా చేసుకుంటే 6.50 శాతం మాత్ర‌మే వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌మ‌యానికి ఖాతాలో డిపాజిట్ చేయ‌క‌పోతే నెల‌కు రూ.100 కి రూ.1.50 చొప్పున జ‌రిమానా విధిస్తుంది.

ప‌న్నులు ఏ విధంగా ఉంటాయి?

రిక‌రింగ్ డిపాజిట్ల‌పై వ‌చ్చే ఆదాయంపై ట్యాక్స్ ప‌డుతుంది. దీనిని ఇత‌ర‌ ఆదాయ వ‌నరుగా లెక్కించి మీ మొత్తం ఆదాయానికి క‌లిపి ప‌న్ను లెక్కిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 30 శాతం శ్లాబులో ఉంటే అదే రేటులో ప‌న్ను ఉంటుంది. వ‌డ్డీ ఆదాయం రూ.10 వేలు దాటితే టీడీఎస్ ప‌డుతుంది. ఖాతాకు పాన్ నంబ‌ర్ జ‌త‌చేయ‌క‌పోతే 20 శాతం ప‌న్ను విధించ‌బ‌డుతుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని