10 నిమిషాల‌లో.. ఈ పాన్‌

ప‌న్ను చెల్లింపుదారుల‌కు శాశ్వ‌త ఖాతా సంఖ్య‌(పాన్)ను, సుల‌భంగా అందించేందుకు ఆదాయ శాఖ ఇ-పాన్ స‌దుపాయ‌న్ని అందుబాటులోకి తెచ్చింది. ఇ- పాన్ విధానాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు, ద‌ర‌ఖాస్తు దారుల‌కు త‌క్ష‌ణ‌మే పాన్ నెంబ‌రును కేటాయించేందుకు కొత్త ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తుంది. ఆర్థిక స‌హాయ మంత్రి అనురాగ్..

Published : 23 Dec 2020 17:28 IST

ప‌న్ను చెల్లింపుదారుల‌కు శాశ్వ‌త ఖాతా సంఖ్య‌(పాన్)ను, సుల‌భంగా అందించేందుకు ఆదాయ శాఖ ఇ-పాన్ స‌దుపాయ‌న్ని అందుబాటులోకి తెచ్చింది. ఇ- పాన్ విధానాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు, ద‌ర‌ఖాస్తు దారుల‌కు త‌క్ష‌ణ‌మే పాన్ నెంబ‌రును కేటాయించేందుకు కొత్త ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తుంది. ఆర్థిక స‌హాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్ర‌భుత్వం పాన్‌/ టాన్ విధానాన్ని, రియ‌ల్ టైమ్ లేదా 10 నిమిషాల లోపే కేటాయించే విధంగా యోచిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇ- పాన్ గురించి 5 ముఖ్య విష‌యాలు:

  1. ఇ-కేవైసీ ఆధారంగా రియ‌ల్‌టైమ్ ప్రాతిప‌దిక‌న‌(10 నిమిషాల‌లోపు) ఇ-పాన్‌ను జారీ చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ట్లు ఠాకూర్ తెలిపారు.
  2. కేంద్ర ప్రత్య‌క్ష ప‌న్ను విభాగం(సీబీడీటీ) డిసెంబ‌ర్‌2018లో జారీ చేసిన నోటికేష‌న్ ప్ర‌కారం క్యూఆర్ కోడ్‌తో పీడీఎఫ్ ఫార్మెట్‌లో చెల్లుబాటు అయ్యే ఇ-పాన్‌కార్డులను జారీ చేస్తున్నారు.
  3. ఆదాయ‌పు ప‌న్ను శాఖ, ఇ-కేవైసీని ఉప‌యోగించి ఎల‌క్ట్రానిక్ ఫార్మెట్‌లో ఎల‌క్ట్రానిక్ పాన్ కార్డు(ఇ-పాన్‌)ను జారీ చేసి ఈ-మెయిల్ ద్వారా పంపిస్తారు. ఇ-పాన్ అనేది డిజిట‌ల్ సంత‌కంతో కూడి ఉంటుంది. ఎల‌క్ట్రానిక్ విధానం ద్వారా ఇత‌ర ఏజెన్సీల‌కు దీనిని ఐడీ ఫ్రూఫ్‌గా ఇవ్వ‌వ‌చ్చు.
  4. ఆధార్ కార్డు ఉన్న భార‌తీయుల‌కు మాత్ర‌మే ఇ-పాన్ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది.
  5. ఇ-కేవైసీ విధానం ద్వారా గానీ, భౌతికంగా కార్డు రూపంలో గానీ పాన్‌ను త‌క్కువ స‌మ‌యంలో జారీ చేసేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ కావ‌ల‌సిన చ‌ర్య‌లు తీసుకుంటుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని