ఫేస్బుక్-ఇన్‌స్టాగ్రామ్‌లో టిప్స్ సంగీతం
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌తో అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టిప్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఫేస్బుక్,
దిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌తో అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టిప్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ సహా ఇతర వేదికలపై వీడియోలకు తమ సంగీతం లైసెన్స్ హక్కులు ఇవ్వనుంది. ఈ ఏడాది టిప్స్ మ్యూజిక్కు కీలకమైన ఏడాదని, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థతో అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టిప్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ ఒప్పందం వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు తమ పోస్ట్‌లు, స్టోరీలకు టిప్స్ మ్యూజిక్‌ను జతచేర్చే సౌలభ్యం కలుగుతుంది. కోట్ల మంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు ఇది ఉపయోగ పడుతుందని టిప్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కుమార్ తరౌనీ అన్నారు. వినియోగదారులకు మ్యూజిక్ వీడియోలు అందించే వ్యవస్థ ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నామని ఫేస్బుక్ ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ పార్టనర్షిప్స్ మనీశ్ చోప్పా అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో సరిగామ ఇండియాతో సైతం ఫేస్బుక్ అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం