Published : 13 Dec 2021 20:39 IST

Business Updates: నేటి బిజినెస్‌ విశేషాలు..!

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41 వేల పోస్టులు ఖాళీ..!
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్యాంకులకు మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో ఇది 5 శాతానికి సమానం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 8,05,986 ఉద్యోగాలు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం ఎస్‌బీఐలో అత్యధికంగా 8,544 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

పీఎఫ్‌ వడ్డీ మీ ఖాతాలో జమ అయ్యిందా?

పీఎఫ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. 8.5 శాతం చొప్పున 25 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఓ సారి చెక్‌ చేసుకోండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

ఆరంభ లాభాలు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ముఖ్యంగా బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ షేర్లు సూచీలను కిందకు లాగాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను స్వీకరించడమే దీనికి ప్రధాన కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

అమెజాన్‌ ప్రైమ్‌ మరింత ప్రియం..! 
అమెజాన్‌ ప్రైమ్ సభ్యత్వం‌ (Amazon Prime Membership) మరింత ప్రియం కానుంది. ఇక నుంచి కొత్తగా సభ్యత్వం తీసుకునేవారు ఏకంగా 50శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సభ్యత్వం రూ.999 ఉండగా రూ.1,499 చేయనున్నట్లు ఆ సంస్థ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

గ్రోఫర్స్‌ ఇకపై బ్లింకిట్‌గా.
నిత్యావసర సరకుల పంపిణీ సంస్థ గ్రోఫర్స్‌ ఇకపై బ్లింకిట్‌గా దర్శనమివ్వనుంది. తాము అందిస్తున్న ‘క్విక్‌ కామర్స్‌’ సేవలకు భారీ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దానికి ప్రాధాన్యమిస్తూ ఈ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని గ్రోఫర్స్‌ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

అదరగొట్టిన టెగా.. ఒక్కో లాట్‌పై రూ.10 వేల లాభం
ఖనిజ శుద్ధి ప్రక్రియ, గనుల తవ్వకం, బల్క్‌ సాలిడ్స్‌ హ్యాండ్లింగ్‌ పరిశ్రమకు అవసరమైన కీలక ఉత్పత్తుల తయారీ, పంపిణీని నిర్వహిస్తోన్న టెగా ఇండస్ట్రీస్‌ షేర్లు నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. 67.77 శాతం ప్రీమియంతో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాయి. ఇష్యూ ధర రూ.453 కాగా రూ.760 వద్ద బీఎస్‌ఈలో.. 69.33 శాతం ప్రీమియంతో రూ.767.10 వద్ద ఎన్‌ఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

పర్సనల్‌ లోన్‌ను ఎప్పుడు బదిలీ చేయాలంటే..?
అత్యవసర ఆర్థిక పరిస్థితులు తలెత్తినప్పుడు వ్యక్తిగత రుణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇటీవలి పండగ సీజన్‌ నేపథ్యంలో చాలా వరకు బ్యాంకులు, ఇతర సంస్థలు రుణాలు అందజేయడానికి కొన్ని ఆఫర్లను ప్రకటించాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే, కొవిడ్‌ భయాలు ఇంకా వెంటాడుతున్న నేపథ్యంలో మరో వేవ్‌ రావడానికి ముందే అప్పుల భారాన్ని తగ్గించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఉన్న మార్గాల్లో రుణాన్ని ఇతర బ్యాంకులకు బదిలీ చేయడం ఒకటి. మరి దీంట్లో ఉన్న లాభనష్టాలేంటో తెలుసుకుందామా?? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని