మీ పోర్టుఫోలియోలో న‌ష్ట‌భ‌యం ఎంత‌?

న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండే పెట్టుబడులలో కొంత, వృద్ధి ఆధారిత ప‌థ‌కాల‌లో కొంత భాగం పెట్టుబ‌డిగా పెట్టాలి.........​

Published : 21 Dec 2020 13:11 IST

న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండే పెట్టుబడులలో కొంత, వృద్ధి ఆధారిత ప‌థ‌కాల‌లో కొంత భాగం పెట్టుబ‌డిగా పెట్టాలి.

14 నవంబర్ 2018 మధ్యాహ్నం 1:26

పోర్టుఫోలియోలో న‌ష్ట‌భ‌యం త‌క్కువ ఉండే పెట్టుబ‌డులు ఉంటే ఏదైనా స‌మ‌స్య ఉంటుందా? సాధార‌ణంగా ఉండ‌ద‌నే అంటాం. అయితే త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కూడా న‌ష్టం ఉంటంద‌ని అంటున్నారు నిపుణులు. మ‌దుప‌ర్లు జాగ్ర‌త్త‌గా త‌మ పోర్టుఫోలియోను గ‌మ‌నిస్తే త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉండేలా చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ఏవైనా పొర‌పాట్లు చేస్తే తెలుసుకోవ‌చ్చు.

సాధార‌ణంగా చేసే కొన్ని పొర‌పాట్లు:

దీర్ఘ‌కాల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌కు స్వ‌ల్ప‌కాలానికి అనుకూలంగా ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం ఒక పొర‌పాటు. ఉదాహ‌ర‌ణ‌కు దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి చేసేవారు స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలో డ‌బ్బులు ఉంచుకోవ‌డం ద్వారా ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావంతో అస‌లు విలువ త‌గ్గేందుకు వీలుంటుంది. కొన్ని సార్లు ఏ రిస్క్ తీసుకోక‌పోవ‌డం కూడా రిస్క్ అవుతుంది. న‌ష్టభ‌యం మ‌రీ ఎక్కువ ఉండ‌టం వ‌ల్ల వృద్ధి రేటు పొంద‌డానికి ఆటంకంగా కూడా ఏర్ప‌డుతుంది. నిర్దేంచిన ల‌క్ష్యాల‌ను చేరేందుకు స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

మరొక సురక్షిత పెట్టుబడి ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్). ఇందులో పొదుపులు సురక్షితంగా ఉంటాయి, కానీ పరిమితం చేసిన ఉపసంహరణ ఫీచర్ వ‌ల్ల‌ అవసరమైనప్పుడు మీకు డబ్బును తీసుకోవ‌డం కుద‌ర‌దు. పెట్టుబడిలో ఈ మీరు లక్ష్యాన్ని నిధుల కోసం రుణం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డొచ్చు. లేదా అవసరమైన నిధుల పొంద‌డం కోసం ఇతర ఆర్థిక‌లక్ష్యాల కోసం కేటాయించిన పొదుపు నుంచి డ‌బ్బు తీసుకోవాల్సి రావొచ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు దీర్ఘ‌కాలంలో మంచి వృద్ధిని సాధించ‌డం ద్వారా మూల‌ధ‌న వృధ్ధిని పొంది ఆర్థిక ల‌క్ష్యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నారు. అప్పుడు త‌గిన పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి గానీ ఆదాయ ఆధారిత పెట్టుబడులను ఎంచుకుంటే ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ఆటంకంగా మారుతుంది. పన్ను మిన‌హాయింపు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల‌ వంటి క్రమానుగత వడ్డీని అందించే పెట్టుబడుల‌ను ఎంచుకుంటే అవి దీర్ఘకాలంలో వృద్ధి చెందేందుకు వీలుండ‌దు. ఎందుకంటే ఎప్ప‌టిక‌ప్పుడు అవి ఆదాయాన్ని మ‌దుప‌ర్ల‌కు పంచుతుంటాయి. వాటి ద్వారా వ‌చ్చిన రాబ‌డిని తిరిగి మ‌దుపుచేసే అల‌వాటు ఉంటే మీకు కావలసిన మొత్తానికి అనుగుణంగా వృద్ధి చెందుతుంది,

కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా:

త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి అవ‌స‌రం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 20 ఏళ్ల‌లో రూ. కోటి సంపాదించాల‌ని ల‌క్ష్యంతో ఈక్విటీ ఫండ్ల‌లో రాబ‌డి అంచ‌నా 12 శాతం చొప్పున నెల‌కు రూ.10,000 చొప్పున మ‌దుపు చేస్తే సంపాదించ‌వ‌చ్చు. అదే న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండే స్థిరాదాయ ప‌థ‌కాల్లో వార్షిక రాబ‌డి అంచ‌నా 7 శాతం చొప్పున నెల‌కు రూ.20,000 పెట్టుబ‌డి చేయాలి. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ న‌ష్ట‌భ‌యం ప్ర‌ధాన వ్య‌త్యాసం. పెట్టుబ‌డుల విష‌యంలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ ఉంటే రాబ‌డి కూడా ఎక్కువ‌గా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది.

న‌ష్ట‌భ‌యం స‌ర్దుబాటు:

అస్స‌లు రిస్క తీసుకుపోవ‌డం వ‌ల్ల మ‌దుప‌ర్లు మంచి వృద్ధి ని పొందేందుకు అవ‌కాశం ఉండ‌దు. మార్కెట్లో ఉండే అస్థిరతను తొలగించలేం గానీ దీర్ఘకాలిక లక్ష్యాలకు ఈక్విటీ వంటి న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబడులను కేటాయించడం ద్వారా మీ లక్ష్యాలపై దాని ప్రభావాన్ని తటస్తం చేయవచ్చు. ఈ పెట్టుబడులు స్వల్పకాలంలో హెచ్చ‌త‌గ్గుల‌కు గురికావొచ్చు కానీ దీర్ఘకాలంలో పెట్టుబడుల పై అస్థిరత త‌గ్గుతుంది. పెట్టుబడి దాని ప్రాధమిక విలువతో అనుగుణంగా కాలక్రమేణా విలువను పొందటానికి అనుమతిస్తుంది.

న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబడ‌ల‌లో మ‌దుపు చేసి దాని విలువను క్రమంగా తనిఖీ చేసుకుంటుంటారు. అయితే వాటిని దీర్ఘకాలం పాటు కేటాయిస్తే ఆ అవసరం ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు పెట్టుబడులను సమీక్షించుకోవ‌టం ద్వారా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. దీని ద్వారా స‌రిగా రాణించ‌ని లేదా రాణించేందుకు అవ‌కాశం లేని పెట్టుబ‌డుల‌ను తొలిగించ‌వ‌చ్చు.

ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా:

దీర్ఘకాల లక్ష్యాల కోసం పెట్టుబడి ప్రారంభించే ముందు, అవసరమైన అత్యవసర నిధిని సృష్టించండి. మీరు ఒకే-ఆదాయం కలిగిన కుటుంబాన్ని కలిగి ఉంటే, మీకు 12 నెలల జీవన ఖర్చులు అత్యవసర నిధిగా ఉండాలి. ఇద్ద‌రు వ్య‌క్తులు ఆదాయం కలిగిన కుటుంబాలు ఆరునెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తాన్ని ఉంచుకుంటే స‌రిపోతుంది. లక్ష్యం స‌మీపించే స‌మ‌యంలో హెచ్చుత‌గ్గుల‌ను త‌గ్గించుకోవ‌డానికి, నిధుల‌ను సుల‌భంగా పొందేందుకు వీలుగా ఉండే ఖాతాలోకి బ‌దిలీ చేయాలి. ఈ రెండు సంరక్షణను తీసుకున్న తర్వాత మెరుగైన రాబడిని సంపాదించగలిగే దీర్ఘకాలిక పెట్టుబడులకు నిధులు సమకూర్చుకోవాలి. పెట్టుబడుల నుంచి కాలానుగుణ చెల్లింపులను అందుకోవచ్చు, ఎందుకంటే ఇది నిర్మాణాత్మకంగా ఉంటాయి. ఉదాహరణకు బాండ్ల పై వ‌చ్చే కూపన్-చెల్లింపులు మ‌దుప‌ర్లు తిరిగి మ‌దుపుచేయ‌క‌పోతే ఖ‌ర్చ‌యిపోతాయి. పెట్టుబడుల ద్వారా వ‌చ్చే వడ్డీ ఆదాయం పెట్టుబ‌డిగా తిరిగి చేసే విధంగా ఉండు క్యుములేటివ్ ఫిక్సిడ్ డిపాజిట్ల‌ను ఎంచుకోవాలి. క్ర‌మంగా వ‌చ్చే ఆదాయం తిరిగి ఆటోమేటెడ్ విధానంలో పెట్టుబడిగా మారేలా చేసుకోవాలి. దీనికి ప్ర‌త్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను తీసుకోవాలి.

రెండూ ఉండాలి:

న‌ష్ట‌భ‌యం, రాబ‌డి రెండింటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యం తీసుకోవ‌డం అంత సుల‌భం కాదు కానీ మ‌దుప‌రి క్రమబద్ధమైన విధంగా పోర్ట్ఫోలియోను నిర్మించుకున్న‌పుడు ఇది సాధ్య‌ప‌డుతుంది. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంపిక చేసుకుని పోర్టుఫోలియో నిర్మించుకోవాలి. అస్థిరత‌ను అధిగ‌మించే విధంగాపోర్టుఫోలియో ఆస్తి కేటాయింపును కలిగి ఉండాలి. పోర్ట్ఫోలియో సురక్షితమైన పెట్టుబడులలో కొంత భాగం త‌ప్ప‌కుండా ఉండాలి. కొంత భాగం వృద్ధి ఆధారిత ప‌థ‌కాల‌లో పెట్టాలి.కొత్త‌గా పెట్టుబ‌డులు ప్రారంభించి పోర్టుఫోలియో నిర్మించుకునేందుకు, ప్రారంభంలో త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి క్ర‌మంగా న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబ‌డులును చేర్చుకుంటూ వెళ్లాలి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఎంత ఉంద‌నేది అంచ‌నా వేసుకోవాలి. దీనికి పెట్టుబ‌డి స‌ల‌హాదారుని సంప్ర‌దించ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని