Innova Crysta: ఇన్నోవా క్రిస్టా సరికొత్త లిమిటెడ్‌ ఎడిషన్‌..!

టొయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌(టీకేఎం) మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని తీసుకొచ్చింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్‌ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Published : 20 Oct 2021 21:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టొయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌(టీకేఎం) మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని తీసుకొచ్చింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్‌ ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కారులోని జీఎక్స్‌ మాన్యూవల్‌, ఆటోమేటిక్‌ వేరియంట్లలో యాడ్‌ ఆన్‌ ప్యాకేజీని కాంప్లిమెంటరీగా ఇస్తోంది. ఇన్నోవా క్రిస్టా జీఎక్స్‌ రేంజి ధర(ఎక్స్‌షోరూం) రూ.17.8 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఈ కారు 7, 8 సీట్ల రకాల్లో లభిస్తోంది. 

ఈ సందర్భంగా టీకేఎం విక్రయాల విభాగం ఏజీఎం మాట్లాడుతూ వి.డబ్ల్యూ.సిగమాని మాట్లాడుతూ ‘‘ఇన్నోవా మార్కెట్లో విడుదలైన నాటి నుంచి ఎంపీవీ విభాగంలో ఆధిపత్యం చలాయిస్తోంది. దీంతో అది మా ఫ్లాగ్‌షిప్‌ ఉత్పత్తిగా మారింది. టెక్నాలజీ, విలాసం,సౌకర్యం,సౌలభ్యం కలిపిన 100 ఇన్నోవా ప్రత్యేక ఫీచర్లను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన లిమిటెడ్‌ ఎడిషన్‌లో 360 డిగ్రీ డిస్ప్లే కెమేరా, హెడ్‌అప్‌ డిస్‌ప్లే, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, వైర్‌లెస్‌ చార్జర్‌, ఎయిర్‌ అయానైజర్‌, 16 రంగుల ఆప్షన్‌తో డోర్‌ ఎడ్జ్‌ లైటింగ్‌ వంటి ఫీచర్లను జోడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని