Twitter: ట్విటర్‌ సీఈవో రాజీనామా.. కొత్త సీఈవోగా భారతీయుడు!

ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన  ట్విటర్‌కు ఇకమీదట భారతీయుడు సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

Updated : 29 Nov 2021 22:35 IST

న్యూయార్క్‌: టెక్‌ ప్రపంచంలో మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్‌ అగర్వాల్‌ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం.

ఎవరీ పరాగ్‌..?
భారత్‌కు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో 2011లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌, యాహూలలో రీసెర్చి చేశారు. 2011లో ట్విటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన పరాగ్‌ అగర్వాల్‌.. 2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)గా నియమితులయ్యారు. గత పదేళ్లుగా ట్విటర్‌లో పనిచేస్తున్న ఆయన.. ట్విటర్‌ టెక్నికల్‌ స్ట్రేటజీ, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కంజ్యూమర్‌, రెవెన్యూ, సైన్స్‌ టీమ్స్‌ల బాధ్యతలు చూస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు