china: సంక్షోభం ముంగిట చైనా రియల్‌ ఎస్టేట్‌..!

చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభం ముంగిట నిలిచింది. విక్రయాల ఆధారంగా చైనాలోని 30 అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రభుత్వ విధించిన

Updated : 31 Oct 2021 15:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం సంక్షోభం ముంగిట నిలిచింది. విక్రయాల ఆధారంగా చైనాలోని 30 అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రభుత్వ విధించిన ఆంక్షల చట్రంలోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని అక్టోబర్‌ 29న బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక పేర్కొంది. చైనా ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అడ్డగోలుగా రుణాలు సమీకరించకుండా గతేడాది త్రీ రెడ్‌లైన్స్‌ పేరిట ఓ పాలసీని తెచ్చింది. సదరు సంస్థ అప్పులు వాటి ఆస్తుల్లో 70శాతానికి మించకూడదు, నికర ఆస్తుల కన్నా నికర అప్పులు తక్కువ ఉండాలి, స్వల్పకాల రుణాల స్వీకరించాలంటే అంతకు సమానమైన మిగులు నగదు చేతిలో ఉండాలి. దీంతో చైనాలోని నియంత్రణ సంస్థలు వీటిని కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టాయి. ఫలితంగా ఆయా రియల్‌ ఎస్టేట్‌ సంస్థల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోయింది.  చెల్లింపులకు నిధులు లేక అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఎవర్‌గ్రాండె, చైనా రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ ఇప్పటికే మూడు ఎర్రగీతల్లో రెండింటిని దాటేశాయి. 

రియల్‌ ఎస్టేట్‌లో స్పెక్యూలేషన్‌ పెరుగుతూ పోతే ఏదో ఒక రోజు కుప్పకూలుతుందని చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ గ్రహించారు. 2017లో ఆయన 19వ సీసీపీ కాంగ్రెస్‌లో మాట్లాడుతూ..‘‘ఇళ్లు ఉండేది నివసించడానికి.. అంతేగానీ స్పెక్యూలేషన్‌కు కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీని ఫలితంగానే గతేడాది ‘త్రీరెడ్‌ లైన్స్‌’ పాలసీని తెచ్చారు. అడ్డగోలుగా అప్పులు తీసుకోవడాన్ని ఇది నియంత్రించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని