UPI transactions: యూపీఐ లావాదేవీల రికార్డ్‌!

యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. జూన్‌ నెలలో ₹5,47,373 కోట్ల విలువైన 2.8 బిలియన్‌ లావాదేవీలు జరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్....

Updated : 02 Jul 2021 19:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ లావాదేవీలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. జూన్‌ నెలలో ₹5,47,373 కోట్ల విలువైన 2.8 బిలియన్‌ లావాదేవీలు జరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) వెల్లడించింది. ఇప్పటి వరకూ జరిగిన యూపీఐ లావాదేవీల్లో ఇదే అధికం కావడం గమనార్హం. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలకు దాదాపు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో వస్తు, సేవలకు డిమాండ్‌ ఏర్పడిందనడానికి దీన్ని సంకేతంగా భావించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

కరోనా సెకండ్‌వేవ్‌తో దేశం దాదాపు గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా ఆంక్షల ఛట్రంలోకి వెళ్లింది. దీంతో ఏప్రిల్‌, మే నెలల్లో యూపీఐ లావాదేవీలు తగ్గాయి. ఏప్రిల్‌ నెలలో ₹4,93,633 కోట్ల విలువైన 2.64 బిలియన్‌ లావాదేవీలు జరగ్గా.. మే నెలలో ₹4,90,638 కోట్ల విలువైన 2.53 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఎన్‌పీసీఐ పేర్కొంది. అంతకుముందు నెలతో పోలిస్తే జూన్‌ నెలలో లావాదేవీలు 10 శాతం మేర పెరగడం గమనార్హం. భవిష్యత్‌లో ఇదే ఒరవడి కొనసాగితే యూపీఐ లావాదేవీలు నెలకు 3 బిలియన్‌ మార్కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దేశంలో డిమాండ్‌ పెరిగిందనడానికి కేవలం యూపీఐ లావాదేవీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే సరిపోదని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని