Blue Origin: బ్లూ ఆరిజిన్‌కు అమెరికా గ్రీన్‌సిగ్నల్‌..!

జెఫ్‌బెజోస్‌ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్‌ సంస్థకు అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ సోమవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ సంస్థ న్యూషెపర్డ్‌

Published : 13 Jul 2021 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జెఫ్‌బెజోస్‌ నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్‌ సంస్థకు అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సోమవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ సంస్థ న్యూషెపర్డ్‌ వ్యవస్థను వాడి ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకెళుతుంది. మరోపక్క అమెజాన్‌ వ్యవస్థాపకుడు ఇదే నౌకలో అంతరిక్ష యానం చేయనున్నారు. జులై 20వ తేదీన వీరి యాత్ర జరగనుంది. ఈ యాత్రకు ఇచ్చిన అనుమతి ఆగస్టు చివరి వరకు వర్తిస్తుంది. ఈ అనుమతుల కోసం హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రెండింటిని ఎఫ్‌ఏఏ సంస్థ పరిశీలించింది. అనంతరం అనుమతులు మంజూరు చేసింది. టెక్సాస్‌లోని లాంఛ్‌సైట్‌ వన్‌ వద్ద నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ప్రపంచ కుబేరుడు జెఫ్‌బెజోస్‌ ఇటీవలే అమెజాన్‌ సీఈవో పదవి నుంచి వైదొలగారు. ఈ బాధ్యతలను సన్నిహితుడు ఆండీ జాస్సీకి అప్పగించారు.  బ్లూ ఆరిజిన్‌పై ఆయన అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. తన సోదరుడు మార్క్‌ బెజోస్‌తో కలిసి త్వరలో అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు. దీంతో అంతరిక్ష పర్యాటకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. దీనిపై ఇప్పటికే ఆయన బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టారు.

ఇటీవలే వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపట్టిన ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.  బ్లూఆరిజన్‌తోపాటు స్పేస్‌ ఎక్స్‌ కూడా ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకుళ్లే ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఒక్కసారి వీరు వాడే రాకెట్లు అంతరిక్ష ప్రయాణాలకు సురక్షితమైనవని తేలితే ఏటా ఈ మార్కెట్‌ 3బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని యూబీఎస్‌ సంస్థ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని