త్వ‌ర‌గా క్లెయిమ్‌ ప‌రిష్కారం కోసం బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోండిలా..

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవ‌డం చాలా సుల‌భం......

Published : 24 Dec 2020 13:38 IST

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవ‌డం చాలా సుల‌భం

ఈపీఎఫ్ చందాదారులు కోవిడ్-19 క్లెయిమ్‌ల‌లో ఆల‌స్యం అవుతుంద‌ని ఈపీఓఎఫ్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనికోసం మీ బ్యాంకు ఖాతా వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కోరింది. బ్యాంకు ఖాతా సంఖ్య‌, ఐఎఫ్ఎస్‌సీ వంటి వివ‌రాల్లో త‌ప్పులు ఉంటే మీ క్లెయిమ్ తిర‌స్కరించే అవ‌కాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేసుకోవ‌డం చాలా సుల‌భం. అయితే దీనికి మీ సంస్థ యాజ‌మాన్యం ఆమోదం కూడా అవ‌స‌రం. కొంత‌మంది క్లెయిమ్ చేస్తున్నారు కానీ వారి బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డంతో క్లెయిమ్ తిర‌స్కారానికి గురువుతోంద‌ని తెలుస్తోంది.

ఈపీఎఫ్ ఖాతాలో బ్యాంకు వివ‌రాలు అప్‌డేట్ చేసుకునే విధానం :

  1. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో యూజ‌ర్ నేమ్, పాస్‌వ‌ర్ట్‌తో లాగిన్ కావాలి
  2. త‌ర్వాత ‘Manage’ ట్యాబ్ పై క్లిక్ చేయాలి
  3. అక్క‌డ క‌నిపించే మెనూలో కేవైసీ సెల‌క్ట్ చేయాలి
  4. బ్యాంక్ సెల‌క్ట్ చేసుకొని ఖాతా సంఖ్య‌, పేర‌, ఐఎఫ్ఎస్‌సీ వంటివి ఎంట‌ర్ చేసి త‌ర్వాత సేవ్ చేయాలి
  5. ఒకసారి దీనిని సంస్థ ఆమోదిస్తే కేవైసీ సెక్ష‌న్‌లో అప్‌డేట్ చేసి బ్యాంక్ వివ‌రాలు క‌నిపిస్తాయి.

ఆన్‌లైన్ పోర్టల్‌లో క్లెయిమ్ చేసేట‌ప్పుడు , చెక్కుపై ఖాతా సంఖ్య‌, ఐఎఫ్‌ఎస్‌సి, పేరు స‌రిగ్గా ముద్రిత‌మై ఉన్నాయో లేదో చూసుకోవ‌డం తప్పనిసరి. ప్రత్యామ్నాయంగా, మీరు బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా అప్‌లోడ్ చేయవచ్చు.

కోవిడ్-19 కార‌ణంగా విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ స‌దుపాయం కల్పించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో

  • డీఏతో క‌లిపి 3 నెల‌ల వేత‌నం లేదా
  • ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం…ఏది త‌క్కువ‌గా ఉంటే అంత మొత్తం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

దీనిని తిరిగి చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆర్థిక భ‌రోసా కోసం ఉద్యోగుల‌కు ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ఈపీఎఫ్ఓ వెల్ల‌డించింది. గ‌త నెల వ‌ర‌కు 8 ల‌క్ష‌ల ఈపీఎఫ్ చందాదారులు మొత్తం రూ.3,2000 కోట్లు విత్‌డ్రా చేసుకున్న‌ట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని