ఈపీఎఫ్ఓలో బ్యాంక్ వివరాలు అప్డేట్ చేసుకోండి
ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా బ్యాంకు వివరాలను సులభంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఈపీఎఫ్ ఖాతా నుంచి సులభంగా ఆన్లైన్ ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించింది. లావాదేవీలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలంటే సరైన బ్యాంకు వివరాలను ఈపీఎఫ్ ఖాతాకు జతచేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈపీఎఫ్‌కి అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్ని మూసివేస్తుంటారు. అటువంటి సమయంలో మరో బ్యాంకు ఖాతాను ఈపీఎఫ్ ఖాతాలో అప్డేట్ చేయడం మర్చిపోతారు. బ్యాంకు ఖాతా వివరాలు సరైనవి లేకపోతే లావాదేవీలు జరగవు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా బ్యాంకు వివరాలను సులభంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాంకు వివరాలను ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం:
1. ఈపీఎఫ్ఓ ఖాతాలో మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
2. 'Manage' ట్యాబ్ క్లిక్ చేయాలి
3. అక్కడ మెనులో 'KYC' ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
4. బ్యాంక్ అని సెలక్ట్ చేసుకొని, బ్యాంక్ ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ని ఎంటర్ చేసి 'Save' క్లిక్ చేయాలి
5. దీనిని యాజమాన్య సంస్థ ఆమోదించిన తర్వాత అప్డేట్ చేసిన బ్యాంక్ వివరాలు కేవైసీ విభాగంలో కనిపిస్తాయి.
డిసెంబర్ చివరి నుంచి ఈపీఎఫ్ఓ చందాదారులకు 8.5 శాతం క్రెడిట్ చేయడం ప్రారంభించింది. సెప్టెంబర్‌లో ఈపీఎఫ్ఓ బోర్డు 8.5 శాతం వడ్డీ ని నిర్ణయించింది. మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. వడ్డీ రేటు 8.15 శాతం, 0.35 శాతంగా విభజించారు. అయితే డిసెంబర్లో 8.5 శాతం ఒకేసారి క్రెడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..