మహీంద్రా గ్రూప్‌నకు వీఎస్‌ పార్థసారథి రాజీనామా

మహీంద్రా అండ్‌ మహీంద్రా అధ్యక్షుడు (మొబిలిటీ సర్వీసెస్‌), ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడైన వీఎస్‌ పార్థసారథి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన వైదొలిగినట్లు మహీంద్రా గ్రూప్‌ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాజీనామా

Updated : 09 Mar 2021 10:43 IST

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా అధ్యక్షుడు (మొబిలిటీ సర్వీసెస్‌), ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడైన వీఎస్‌ పార్థసారథి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన వైదొలిగినట్లు మహీంద్రా గ్రూప్‌ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాజీనామా అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఆయన మహీంద్రా లాజిస్టిక్స్‌, మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ వీల్స్‌, మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ సర్వీసెస్‌ వంటి మొబిలిటీ వ్యాపారాలను చూస్తున్నారు. మేరు, స్మార్ట్‌షిఫ్ట్‌, జూమ్‌కార్‌ల్లో కంపెనీ పెట్టుబడులను సైతం పర్యవేక్షిస్తున్నారు. మహీంద్రా లాజిస్టిక్స్‌ బోర్డు నుంచి కూడా పార్థసారథి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా అనీశ్‌ షా చేరుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని