Home Loan: వివిధ బ్యాంకులు ఆఫ‌ర్ చేస్తున్న తాజా వ‌డ్డీరేట్లు

గృహ‌రుణం తీసుకునేప్పుడు రుణం మొత్తం, వ‌డ్డీ రేటుతో పాటు.. కాల‌ప‌రిమితి, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్ ఫీజులు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి

Updated : 03 Aug 2021 13:01 IST

సుదీర్ఘ‌కాలంపాటు కొన‌సాగే రుణాల‌లో గృహ‌రుణం కూడా ఒక‌టి. వ్య‌క్తిగ‌తంగా గానీ, ఉమ్మ‌డిగా గానీ గృహ రుణం తీసుకునే వీలుంది. గృహం మొత్తం విలువ‌లో  80 నుంచి 90 శాతం వ‌ర‌కు రుణం పొందే అవ‌కాశం ఉంటుంది. ఇది బ్యాంకు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్ రూపంలో కొనుగోలు దారుడు స్వ‌యంగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం విలువ ఎక్కువ కాబ‌ట్టి కాల‌ప‌రిమితి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. 15 నుంచి 30 సంవ‌త్స‌రాల పాటు చెల్లింపుల‌కు స‌మ‌యం ఉంటుంది. ఎక్కువ సంవ‌త్స‌రాల కొన‌సాగిస్తే నెల‌వారిగా చెల్లించాల్సిన ఈఎమ్ఐ త‌గ్గుతున్న‌ప్ప‌టికి..వ‌డ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వ‌స్తుంది. ఒక్కోసారి ఎంత రుణం తీసుకుంటారో అంత మొత్తం వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది. అందువ‌ల్ల గృహ‌రుణం తీసుకునేప్పుడు రుణం మొత్తం, వ‌డ్డీ రేటుతో పాటు.. కాల‌ప‌రిమితి, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్ ఫీజులు త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.  

25 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో.. రూ.30 ల‌క్ష‌ల రుణం తీసుకుంటే వివిధ బ్యాంకులు వ‌ర్తింప చేసే వ‌డ్డీ రేట్లు, ఈఎమ్ఐ, ప్రాసెసింగ్ ఫీజు త‌దిత‌ర వివ‌రాల‌ను ఈ కింది ప‌ట్టిక‌లో చూడొచ్చు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని