Vistara: నేరుగా దిల్లీ నుంచి ప్యారిస్‌కు.. విస్తారా విమాన సేవలు!

దిల్లీ నుంచి నేరుగా ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌కు చేరుకునేలా ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా సేవల్ని ప్రారంభించింది....

Updated : 08 Nov 2021 12:28 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి నేరుగా ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌కు చేరుకునేలా ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా సేవల్ని ప్రారంభించింది. ప్రతి ఆదివారం, బుధవారం నడిచే ఈ విమానం ఎక్కడా ఆగకుండా నేరుగా ప్యారిస్‌ చేరుకుంటుంది. కరోనా నేపథ్యంలో భారత్‌ ఫ్రాన్స్‌ మధ్య ‘ఎయిర్‌బబుల్‌ ఒప్పందం’లో భాగంగా ఈ సేవల్ని ప్రారంభించారు. దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్యారిస్‌లోని చార్లెస్‌ డీ గల్లే ఎయిర్‌పోర్టుకు విస్తారాకు చెందిన బోయింగ్‌ 787-9 (డ్రీమ్‌లైనర్‌) విమానం చేరుకోనుంది.

ఇప్పటి వరకు నేరుగా ఎక్కడా ఆగకుండా.. లండన్‌, దుబాయ్‌, దోహా, షార్జా, మాలేకు మాత్రమే భారత్‌ నుంచి విమానాలు నడుస్తున్నాయి. టాటా సన్స్‌-సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విస్తారా చేసుకున్న ఒప్పందం వల్ల తాజాగా ఈ జాబితాలో ప్యారిస్‌ కూడా చేరింది. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, ఆర్థిక సంబంధాల వల్ల దిల్లీ-ప్యారిస్‌ మధ్య తరచూ ప్రయాణాలు జరుగుతుంటాయని విస్తారా సీఈఓ లెస్లీ థంగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని