వొడాఫోన్‌ కేసు తీర్పుపై సింగపూర్‌ హైకోర్టులో దావా

పాత తేదీలతో పన్ను వివాదానికి సంబంధించి వొడాఫోన్‌ గ్రూపు పీఎల్‌సీకి అనుకూలంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, సింగపూర్‌ హైకోర్టులో భారత్‌ దావా వేసింది. అలాగే కెయిర్న్‌ కేసు తీర్పు వ్యవహారంలో

Published : 09 Feb 2021 01:11 IST

లోకసభలో మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడి

దిల్లీ: పాత తేదీలతో పన్ను వివాదానికి సంబంధించి వొడాఫోన్‌ గ్రూపు పీఎల్‌సీకి అనుకూలంగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, సింగపూర్‌ హైకోర్టులో భారత్‌ దావా వేసింది. అలాగే కెయిర్న్‌ కేసు తీర్పు వ్యవహారంలో అప్పీల్‌కు వెళ్లే విషయాన్ని పరిశీలిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ విషయాలను లోక్‌సభకు తెలియజేశారు. పాత పన్ను చట్టాలను అనుసరించి పన్నులు, జరిమానాల రూపంలో రూ.22,100 కోట్లు చెల్లించాలంటూ వొడాఫోన్‌కు భారత ప్రభుత్వం పంపిన నోటీసులను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం గతేడాది సెప్టెంబరులో తిరస్కరించిన సంగతి తెలిసిందే. అలాగే కెయిర్న్‌ ఎనర్జీకి విధించిన రూ.10,247 కోట్ల పన్ను వివాదంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని