Published : 07 Dec 2021 18:13 IST

Volkswagen Tiguan: ఫోక్స్‌వ్యాగన్‌ టిగువాన్‌ సరికొత్తగా.. ధరెంతంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ 2021 టిగువాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ను మంగళవారం భారత్‌లో విడుదల చేసింది. పూర్తిగా దేశీయంగా అనుసంధానం చేసిన ఈ కారు ధరను రూ.31.99 లక్షలుగా నిర్ణయించారు. కేవలం పెట్రోల్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2020లో తొలిసారి మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు తాజాగా అనేక స్టైలింగ్‌ మార్పులతో మన ముందుకు వచ్చింది. జీప్‌ కంపాస్‌, హ్యుందాయ్‌ టక్సన్‌, సిట్రాన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌ కార్లకు ఇది పోటీ ఇవ్వనుంది.

తాజా వెర్షన్‌లో డిజైన్‌ పరంగా ముందు భాగంలో కొన్ని మార్పులు చేశారు. రేడియేటర్‌ గ్రిల్‌ను స్వల్పంగా వంచారు. చివర్లలో సన్నగా మారిన ఈ గ్రిల్‌లోనే ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌ను అమర్చారు. వెనుక భాగంలో సన్నటి టెయిల్‌లైట్స్‌ మినహా పెద్దగా మార్పులేమీ చేయలేదు. 30 షేడ్స్‌ యాంబియెంట్‌ లైటింగ్‌, పానరోమిక్‌ రూప్‌, టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, మల్టీ ఫంక్షన్‌ ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌ వీల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరిచారు. 2 లీటర్‌, 4 సిలిండర్‌ టర్బోఛార్జ్‌డ్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు 320 ఎన్‌ఎం టార్క్‌ దగ్గర 187 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని